NTV Telugu Site icon

Pat Cummins: యాంకర్‌ ప్రపోజల్‌కు క్రేజీ ఆన్సర్ ఇచ్చిన ఆస్ట్రేలియా కెప్టెన్

Cummins

Cummins

Pat Cummins: క్రికెటర్లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉండడం సహజమే. ముఖ్యంగా టీమిండియా లాంటి ఆటగాళ్లకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇకపోతే, ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు కేవలం వారి దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అభిమానులు ఉన్నారు. అందులో ఎందరో మహిళా అభిమానులు కూడా ఉన్నారు. ఇకపోతే తాజాగా, ‘డేట్ విత్ ఏ సూపర్ స్టార్’ అనే టీవీ షోలో కమిన్స్ తనపై ఉండే ఫీమేల్ అటెన్షన్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ షోలో హోస్ట్ సాహిబా బలి మాట్లాడుతూ.. ఇండియాలో మీకు చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా మహిళల్లో. చాలా మంది అమ్మాయిలకు మీరంటే ఇష్టం. నాకు, నా బెస్ట్ ఫ్రెండ్, మిగతా మహిళలకు మీరంటే చాలా ఇష్టం. మీపై మాకు క్రష్ ఫీలింగ్ ఉంది. మీకు పెళ్లి అయిందని తెలిసినా, మీరు ఇలా అనేక అమ్మాయిల అభిమానాన్ని ఎలా సంపాదించుకున్నారని అడిగింది.

Also Video: Ajith Car Accident: ఘోర ప్రమాదం నుండి బయటపడ్డ స్టార్ హీరో

దానికి కమిన్స్ సమాధానంగా.. ఇది ఎలా మొదలైందో నాకు తెలీదు. కేవలం నా పని చేస్తూ ముందుకెళ్తాను. ఇంకేం అనలేనని చెప్పాడు. ఆయనకు ఈ అభిమానంపై ఎలాంటి ప్రత్యేక అనుభూతి లేదని పేర్కొన్నాడు. ఇక, ఇంతటి అభిమానం తనకు ఎక్కువగా భారత్‌లో ఉంటుందని చెప్పాడు. భారతీయ అభిమానులు చాలా క్రేజీగా ఉంటారు. ప్లేయర్స్ ఎక్కువ సమయం తమ జట్టుతో హోటల్‌లో గడుపుతారు. అందువల్ల వారి కుటుంబంతో మాత్రమే గడుపుతామని ఇతరులతో పర్సనల్‌గా మాట్లాడడం కష్టమే అని కమిన్స్ వివరించాడు. ఇక ఆస్ట్రేలియా జట్టు విషయానికి వస్తే, ఇటీవల బోర్డర్ గావస్కర్ ట్రోఫీని పదేళ్ల తర్వాత సొంతం చేసుకుంది. టీమిండియాతో జరిగిన పోరులో ఆస్ట్రేలియా విజయాన్ని సాధించి 2025 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించింది.