Pat Cummins: ట్యాంపరింగ్ కలకలం.. పబ్లిక్‌లోనే భార్యతో గొడవ.. కెప్టెన్ పాట్ కమిన్స్ కీలక ప్రకటన..

Pat Cummins

Pat Cummins

Pat Cummins: ఆస్ట్రేలియా క్రికెట్‌లో మరోసారి ‘శాండ్‌పేపర్‌గేట్’ (Sandpapergate) వివాదం రాజుకుంది. ఆస్ట్రేలియా (Australia) టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins), ఆయన భార్య బెక్సీ (Becky)కి సంబంధించిన ఓ పబ్లిక్ గొడవ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, మరోవైపు ఉస్మాన్ ఖావాజా (Usman Khawaja) తన కొత్త ఆటోబయోగ్రఫీలో సంచలన నిజాలు బయటపెట్టడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 2018లో సౌతాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్ ఉదంతం క్రికెట్ ప్రపంచాన్ని ఎంతగా కుదిపేసిందో తెలిసిందే. ఆ సమయంలో స్టీవ్ స్మిత్ (Steve Smith), డేవిడ్ వార్నర్ (David Warner), కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ (Cameron Bancroft)లపై క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) కఠిన చర్యలు తీసుకుంది.

అయితే, తాజాగా ఉస్మాన్ ఖావాజా తన “సబ్ర్” (Sabr) అనే పుస్తకంలో.. ఆ కేప్‌టౌన్ టెస్ట్‌తో పాటు అంతకుముందు పోర్ట్ ఎలిజబెత్ (Port Elizabeth) టెస్ట్‌లోనూ బాల్ ట్యాంపింగ్ ప్లాన్ గురించి కమిన్స్‌తో సహా మొత్తం టీమ్‌కి ముందే తెలుసని బాంబ్ పేల్చాడు. దీనిని ‘శాండ్‌పేపర్‌గేట్ 2.0’ (Sandpapergate 2.0) అని పిలుస్తున్నారు. మరో పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. ఈ వివాదంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయని పాట్ కమిన్స్, త్వరలోనే మీడియా ముందుకు రానున్నారు. సిడ్నీలోని క్రికెట్ సెంట్రల్ (Cricket Central) వేదికగా జరుగుతున్న షెఫీడ్ షీల్డ్ (Sheffield Shield) మ్యాచ్ సందర్భంగా శుక్రవారం ఉదయం 9:30 గంటలకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఖావాజా చేసిన ఆరోపణలపై పూర్తిగా స్పష్టత తెచ్చుకున్న తర్వాతే మాట్లాడతానని, మీడియా అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని కమిన్స్ ఎక్స్ (X) వేదికగా స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే, ఈ వివాదాల మధ్యలోనే పాట్ కమిన్స్, ఆయన భార్య బెక్సీ బహిరంగంగా వాదించుకుంటున్నట్లు ఉన్న ఓ వీడియో నెట్టింట వైరల్ అయింది. వారిద్దరి మధ్య ఏదో జరుగుతోందని, రిలేషన్‌షిప్‌లో (Relationship) సమస్యలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే, ఆ రూమర్లకు చెక్ పెడుతూ బెక్సీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కమిన్స్, తమ కూతురితో ఉన్న ఫోటోను షేర్ చేసి ‘మై లవ్స్’ (My loves) అని క్యాప్షన్ పెట్టింది. దీంతో ఆ వార్తలన్నింటికీ పుల్ స్టాప్ పడింది. మొత్తానికి, కమిన్స్ ప్రెస్ మీట్‌లో ఎలాంటి విషయాలు బయటపెడతారనేది ఇప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్‌లో సర్వత్రా ఆసక్తికరంగా మారింది.