Site icon NTV Telugu

Passport Application Fees : పాస్ పోర్ట్ అప్లికేషన్ ఫీజులను భారీగా పెంచిన లండన్

12333

12333

Passport Application Fees : ఐదేళ్లలో తొలిసారిగా పాస్‌పోర్ట్ దరఖాస్తుల రుసుము లండన్ ప్రభుత్వం పెంచింది. పార్లమెంట్‌లో పరిశీలించిన తర్వాత ధరలను ప్రకటించారు. పాస్‌పోర్ట్‌లు జారీ చేయడం కోసం సాధారణ పన్నుల నుండి వచ్చే నిధులపై ఆధారపడకుండా.. ఫీజు పెంపు ద్వారా మొత్తాన్ని సేకరించనుంది. ముందస్తు చర్యగా దరఖాస్తు ఫీజు పెంపును ప్రవేశపెట్టారు. సవరించిన పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫీజులు ఫిబ్రవరి 2 నుంచి లండన్ లో అమల్లోకి రానున్నాయి.

Read Also: Union Budget 2023: బడ్జెట్‌లో 7 అంశాలకు ప్రాధాన్యత.. సామాన్యుల సాధికారతే లక్ష్యం

లండన్ లో ప్రామాణిక ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజు పెద్దలకు 75.50పౌండ్లు(రూ.7609.29) నుండి 82.50పౌండ్లు(రూ.8314.78)కి పెరుగుతుంది. పిల్లలకు ఇది 49(రూ.4938.48)పౌండ్లు నుండి 53.50(రూ.5392.01)పౌండ్లకి పెరుగుతుంది. పోస్టల్ దరఖాస్తులు పెద్దలకు 85(రూ.8566.75)పౌండ్ల నుండి 93(రూ.9373.03)పౌండ్లుకి, పిల్లలకు 58.50పౌండ్ల(రూ.5895.94) నుండి 64(రూ.6450.26)పాండ్లకి పెరుగుతాయి. విదేశాల నుండి UK పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసినప్పుడు, ప్రామాణిక ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజు పెద్దలకు 86పౌండ్ల() నుండి 94పౌండ్లకి మరియు పిల్లలకు 56పౌండ్ల నుండి 61పౌండ్లకి పెరుగుతుంది. ఓవర్సీస్ స్టాండర్డ్ పేపర్ అప్లికేషన్‌లు పెద్దలకు 95.50పౌండ్ల నుండి 104.50పౌండ్లకి పెరుగుతాయి. పిల్లలకు ఇది 65.50పౌండ్ల నుండి 71.50పౌండ్లకి పెరుగుతుంది.

Read Also: Pension for 66years : 66ఏళ్ల పాటు పింఛన్ తీసుకున్న తాత కన్నుమూత

దరఖాస్తు చేసిన ఐదు రోజులలోపు పాస్‌పోర్ట్ పొందేందుకు 500పౌండ్ల ప్రాధాన్యత సేవా రుసుము విడిగా చెల్లించాలి. ఇది వినియోగదారులందరికీ ఒకే మొత్తంలో ఉంటుంది. పాస్‌పోర్ట్ దరఖాస్తుల ఖర్చుల నుండి UK ప్రభుత్వం ఎటువంటి లాభాన్ని పొందదని.. పాస్‌పోర్ట్ అప్లికేషన్‌లను ప్రాసెస్ చేసే ఖర్చులు మరియు పాస్‌పోర్ట్‌లతో సహా కోల్పోయిన లేదా దొంగిలించబడిన పాస్‌పోర్ట్‌ల పునరుద్ధరణ ఖర్చులను కవర్ చేయడానికి రుసుము ఉపయోగించబడుతుందని పాస్‌పోర్ట్ కార్యాలయం తెలిపింది.

Exit mobile version