NTV Telugu Site icon

Padmavati Express: పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దారుణం.. రైలు నుంచి తోసేసి..!

Padmavati Express

Padmavati Express

Padmavati Express: పద్మావతి ఎక్స్ ప్రెస్ లో దారుణమైన ఘటన జరిగింది.. అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్‌ సమీపంలో ఓ ప్రయాణికుడిని రైలు నుంచి తోసేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. ఈ ఘటనలో ప్రయాణికుడు రమేష్ కు తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రి కి తరలించారు.. గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో రైలులో సీటు కోసం గొడవపడిన వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడట రమేష్.. దీంతో.. ఆగ్రహంతో ఊగిపోయిన ఇద్దరు ప్రయాణికులు.. రమేష్‌ను రైలు నుంచి బయటకు తోసేశారు.. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు రమేష్‌.. క్షతగాత్రుడు అన్నమయ్య జిల్లా పిటిఎం మండలం కుమ్మవారి పల్లెకు చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు.. ఇక, రైలు నుంచి తోసివేయడంతో.. కిందపడిపోయిన రమేష్.. తర్వాత తేరుకుని 108కి సమాచారం ఇచ్చాడు.. దీంతో.. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. బాధితుడిన ఆస్పత్రికి తరలించారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు..

Read Also: IIIT Student: ట్రిపుల్ ఐటీ విద్యార్థినిల మరణాలు.. వీసీ వెంకట రమణ క్లారిటీ