Site icon NTV Telugu

Flight: విమానంలో దుర్వాసన.. ప్రయాణికులు ఏం చేశారంటే..!

Flite

Flite

విమాన ప్రయాణమైనా.. రైలు ప్రయాణమైనా.. లేదంటే బస్సు ప్రయాణమైనా.. రెండు నెలల ముందుగానో.. లేదంటే నాలుగు నెలల ముందుగానో టికెట్లు రిజర్వేషన్ చేసుకుంటారు. ముందస్తు ప్రణాళికలు లేకపోతే జర్నీ చేయని పరిస్థితులు ఉంటాయి. అందుకోసం ముందే బుక్ చేసుకుంటారు. ప్రయాణంలో ఇదొక భాగం. ఇక రైళ్లు గానీ.. విమానాలు గానీ.. బస్సులు గానీ.. ప్రయాణం ప్రారంభానికి ముందు కండీషన్స్.. పరిశుభ్రత సిబ్బంది చెక్ చేసుకుంటారు. అంతా బాగున్నాకే ప్లాట్‌ఫాం మీదకో.. లేదంటే రన్‌వే పైకి వస్తుంటాయి. కానీ అమెరికాలో ప్రయాణికులకు ఒక చేదు అనుభవం ఎదురైంది. సాఫీగా ప్రయాణం సాగించాలన్న ఉద్దేశంతో ఫ్లైట్‌లోకి ఎక్కిన ప్యాసింజర్స్‌కు చుక్కలు కనిపించాయి. ఎక్కిఎక్కగానే తీవ్రమైన దుర్గంధం రావడంతో కనీసం కొన్ని నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితి దాపురించింది. దీంతో ఎక్కిన ప్రయాణికులంతా ఎమర్జెన్సీ ద్వారాల నుంచి జారుకుంటూ వచ్చేశారు. ఈ దారుణ పరిస్థితి షార్లెట్ డగ్లస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: KKR vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్..

టేకాఫ్‌కు ముందే దుర్వాసన రావడంతో ప్రయాణికులు కిందికి దిగేశారు. బుధవారం సాయంత్రం అమెరికాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కిందకి దిగే క్రమంలో పలువురు ప్రయాణికులు కూడా గాయపడినట్లుగా తెలుస్తోంది. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సంఘటనపై విమాన సంస్థ.. ప్రయాణికులకు క్షమాపణ చెప్పింది. ఈ ఘటనకు కారకులపై దర్యాప్తు తర్వాత యాక్షన్ తీసుకుంటామని వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Bengaluru cafe blast: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. అనుమానితులపై రూ. 20 లక్షల రివార్డ్..

ఓర్లాండోలో ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 1759.. బుధవారం రాత్రి షార్లెట్ డగ్లస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. విమానంలో 226 మంది ప్రయాణికులు ఉన్నారు. టేకాఫ్‌కు సిద్ధపడుతుండగా తీవ్రమైన దుర్వాసన రావడం ప్రారంభమైంది. దీంతో వాసన భరించలేక ఎమర్జెన్సీ డోర్‌ల నుంచి కిందకు దిగేశారు. ఇలా చేయడంతో ప్రయాణికులు గాయపడ్డారు. అనంతరం ప్రత్యామ్నాయ విమానంలో ప్రయాణికులను పంపించారు. ప్రయాణికులకు విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పింది. సంఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.

 

Exit mobile version