NTV Telugu Site icon

MP: పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు..తప్పిన పెను ప్రమాదం

Train Derails

Train Derails

రైలు సామాన్యుడి నేల విమానం. టికెట్ల ధరలు తక్కువగా ఉండటంతో సామాన్యులు ఎక్కువ మంది రైల్వే ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. ఈ రైల్వే ప్రయాణాన్ని చాలా మంది సురక్షితమని భావిస్తారు. కానీ ప్రస్తుతం రైలు ఎక్కాలంటే జనాలు భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా మరోసారి రైలు ప్రమాద ఘటన వెలుగు చూసింది.

READ MORE: BCCI: గొప్ప మనసు చాటుకున్న బీసీసీఐ.. నేపాల్ జట్టుకు ఇండియాలో శిక్షణ

మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ రైల్వే జంక్షన్ వద్ద ప్యాసింజర్ రైలు రెండు కోచ్‌లు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. రైలు నంబర్ 01663 రాణి కమలపాటి స్టేషన్ నుంచి బీహార్‌లోని సహర్‌సతాకు వెళ్లడానికి బయలుదేరింది. రైలు దాదాపు సాయంత్రం 6.15 గంటలకు ఇటార్సీ రైల్వే స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంది. ప్లాట్‌ఫారమ్ నంబర్-2కి చేరుకునేలోపే.. రైలులోని రెండు ఏసీ కోచ్‌లు బి1, బి2 పట్టాలు తప్పాయి. ఈ ఘటన జరిగిన సమయంలో రైలు వేగం చాలా తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఉపశమనం కలిగించే అంశం. అయితే ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పట్టాలు తప్పిన కోచ్‌లను మళ్లీ ట్రాక్‌లోకి తీసుకురావడానికి స్థానిక రైల్వే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.