Site icon NTV Telugu

Video: లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు మృతి

Acc

Acc

ఆదివారం గుజరాత్‌లోని హైవేపై 65 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రక్షణ గోడపై నుంచి పడిపోవడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. ఎనిమిది మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం సపుతర కొండ పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని అధికారి తెలిపారు.

ఇది కూడా చదవండి: Rana Daggubati : బాహుబలి బ్యానర్లో రానా కొత్త సినిమా.. కానీ?

హైవేపై మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించిన బస్సు వంపు దగ్గర అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొని బోల్తా పడినట్లు వీడియోలో కనిపించింది. సాయంత్రం 5 గంటల సమయంలో పర్యాటకులతో బస్సు వెళ్తుండగా రక్షణ గోడ దూకి బోల్తా పడటంతో ఇద్దరు పిల్లలు మరణించారు అ ని అధికారి తెలిపారు. లగ్జరీ బస్సులో సూరత్ నుంచి సపుతారాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని అధికారి తెలిపారు.

ఇది కూడా చదవండి: PM Modi: రష్యాలో ముగిసిన మోడీ టూర్.. ఆస్ట్రియాకు పయనం

Exit mobile version