NTV Telugu Site icon

Shocking: పాము కాటుతో చనిపోయాడు.. అంత్యక్రియలు చేసిన 15ఏళ్లకు తిరిగివచ్చాడు

Shocking

Shocking

Shocking: ఉత్తరప్రదేశ్ లోని డియోరియా జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 15ఏళ్ల క్రితం 12ఏళ్ల బాలుడు పాముకాటుతో చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని సరయూ నదిలో సంప్రదాయపద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. కానీ 15ఏళ్ల తర్వాత యువకుడు తన సొంత ఇంటికి తిరిగివచ్చాడు. ఇప్పుడు ఈ వార్త సర్వత్రా చర్చనీయాంశమైంది.

వివరాలు.. భాగల్‌పూర్ బ్లాక్‌లోని మురసో గ్రామానికి చెందిన రామ్‌సుమేర్ యాదవ్ కుమారుడు అంగేష్ (12) 15 ఏళ్ల క్రితం పాము కాటుకు గురయ్యాడు. దీంతో అతని శరీరం మొత్తం నీలం రంగులోకి మారిపోయింది. కుటుంబసభ్యులు అతడిని అంత్యక్రియల నిమిత్తం భాగల్పూర్‌లోని సరయూ నది ఘాట్‌కు తీసుకెళ్లారు. అంగేష్ మృతదేహాన్ని నదిలో వదిలేందుకు కుటుంబ సభ్యులు పడవ ఎక్కుతుండగా, అతడు అకస్మాత్తుగా మూత్ర విసర్జన చేశాడు. దీంతో బతికే ఉన్నాడని నమ్మి తిరిగి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, అంగేష్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అతని కుటుంబ సభ్యులు అతని మృతదేహాన్ని అరటి మొక్కకు కట్టి, సంప్రదాయం ప్రకారం సరయూ నదిలో వదిలారు.

Read Also: Covid-19: కొవిడ్‌ పుట్టుక చైనా ల్యాబ్‌ నుంచే..!

తిరిగి వచ్చిన అంగేష్..
ఆదివారం బల్లియా జిల్లాలోని బెల్తార రోడ్డుకు చెందిన తనకు తెలిసిన వ్యక్తి తనకు వాట్సాప్‌లో ఫొటో పంపాడని సర్పంచ్‌ ప్రతినిధి సత్యేంద్ర యాదవ్‌ తెలిపారు. ఈ మెసేజ్‌లో ఓ యువకుడు మీ ఊరి నివాసి అని పేర్కొన్నాడు. కానీ తన ఊరి పేరు చెప్పలేదు. ఈ ఫోటోను గ్రామంలోని అందరికీ చూపించగా, ఆ బాలుడు పాముకాటుకు గురై నదిలో కొట్టుకుపోయిన అంగేష్ అని అర్థమైంది. ఆ తర్వాత గ్రామస్థులు కొందరు బాలుడి తల్లి, అత్త, సర్పంచ్‌ ప్రతినిధితో కలిసి బెల్తార రోడ్డులోని ఓ దుకాణానికి చేరుకునే సమయానికి అతడు అక్కడనుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కుటుంబసభ్యులు గాలించగా మణియర్ థానేలో ఉన్నాడని తెలిసింది. అక్కడికి వెళ్లాక ఓ వ్యక్తి అతడిని గుర్తించాడు. అతను క్రమంగా తన తల్లి, అత్తను గుర్తించాడు. ఆ తర్వాత ఊరికి తీసుకొచ్చాక.. రోడ్డు మీద ఊరికి వెళ్లే దారిని స్వయంగా చెప్పాడు. అతనే తన ఇంటికి వెళ్లాడు.

అంగేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబీకులు అతడిని తరలించినప్పుడు అపస్మారక స్థితిలో ఉన్నానని చెప్పాడు. స్పృహలోకి వచ్చిన తరువాత, పాట్నాలోని ఓ ఇంట్లో ఉన్నానని చెప్పాడు. కానీ అతడికి ఏమీ అర్థం కాలేదు. అతను అమన్ మాలి అనే వ్యక్తి పెంచుకున్నాడని వివరించాడు. అమల్ మాలి అనే వ్యక్తి పాము ఆట ఆడించే వాడని, ఆతడితో కలిసి చాలా కార్యక్రమాలు చేశానని చెప్పాడు. ప్రోగ్రాంల నిమిత్తం అతడు బీహార్‌లోని కతిహార్‌కు చేరుకున్నానన్నాడు.

Read Also: Zelensky: వ్లాదిమిర్ పుతిన్ తన దగ్గర వాళ్లతోనే చంపబడతాడు.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

హర్యానాలో అమ్మేశాడు
అమన్ మాలి మరణించిన తరువాత, అతని సహచరులలో ఒకరు ఏడేళ్ల క్రితం హర్యానాలోని ఒక వ్యక్తికి అంగేష్‌ను విక్రయించారు. అతడి దగ్గరే ఏడుసంవత్సరాలు పనిచేశాడు. ఆవులు, గేదెలను మేపడంతోపాటు ఏ పనైనా చేసేవాడు.

ట్రక్ డ్రైవర్ సహాయం చేశాడు
ఫిబ్రవరి 24న ఓ ట్రక్కు డ్రైవర్‌ను కలిశానని అంగేష్‌ తెలిపాడు. అతను అజంగఢ్ వెళ్తున్నాడు. ఎలాగోలా ఆ ట్రక్కు సాయంతో హర్యానా నుంచి బయట పడి అజంగఢ్ చేరుకున్నాడు. తన ఊరి పేరు అతనికి గుర్తులేదు. బెల్తార రోడ్డు మాత్రమే గుర్తుకు వచ్చింది. ట్రక్ డ్రైవర్ అతన్ని బెల్తారాకు పంపించాడు. అక్కడ స్టేషన్ వెనుక ఉన్న ఓ దుకాణానికి చేరుకున్నాడు. అక్కడ తన గ్రామంలోని కొంతమంది వ్యక్తుల పేర్లు గుర్తొచ్చాయి. స్థానికులు అతడిని విచారించగా మున్నా యాదవ్ పేరు గుర్తుకు వచ్చింది. మున్నా యాదవ్ స్వగ్రామానికి చెందినవాడు. అలా 15 ఏళ్ల తర్వాత తన ఇంటికి చేరుకున్నాడు.

Show comments