సినిమా పరిశ్రమలో గ్లామర్ వెనుక దాగి ఉన్న చేదు నిజాలను, నటీమణులు ఎదుర్కొనే ఇబ్బందులను మలయాళ స్టార్ హీరోయిన్ పార్వతి తిరువోత్తు షాకింగ్ కామెంట్స్ చేశారు. నటి పార్వతి తన కెరీర్ ఆరంభంలో ఎదురైన ఒక హృదయ విదారక సంఘటనను గుర్తు చేసుకున్నారు, అప్పట్లో ఆమె ధనుష్ హీరోగా నటిస్తున్న ఒక సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఆ సీన్ ప్రకారం ఆమె నీళ్లల్లో నానినట్టు కనిపిస్తూ ఉండాలి, దీంతో ఆమె మీద నిరంతరం నీళ్లు కుమ్మరిస్తూ వచ్చింది టీం. అయితే, దురదృష్టవశాత్తూ ఆ సమయంలో పార్వతి నెలసరి(Periods)లో ఉన్నారు, షూటింగ్ జరుగుతున్నంత సేపు ఆమెపై నీళ్లు పోస్తూనే ఉన్నారు. తడిచిన బట్టలతో గంటల తరబడి ఉండటం, పైగా పీరియడ్స్ సమయంలో వచ్చే శారీరక అసౌకర్యం ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టగా కనీసం మార్చుకోవడానికి అదనపు దుస్తులు కూడా తెచ్చుకోని పరిస్థితి అది. ఆ సమయంలో షూటింగ్ స్పాట్లో ఒక్క మహిళా సిబ్బంది కూడా లేకపోవడం ఆమెను మరింత మానసిక వేదనకు గురిచేసింది.
Also Read :Mahesh Babu: మీకోసం ఆరోజే తలుపులు తెరుస్తున్నాం.. మహేష్ బాబు కీలక ప్రకటన
ఒకానొక దశలో భరించలేకపోయిన పార్వతి.. తాను హోటల్‌కు వెళ్లి బట్టలు మార్చుకుని వస్తానని దర్శకుడిని కోరగా ఆ డైరెక్టర్ కనీసం ఆమె ఇబ్బందిని అర్థం చేసుకోకుండా, “మనకు సమయం లేదు, షూటింగ్ వెంటనే పూర్తి కావాలి” అంటూ ఆమెపై కేకలు వేశారట. చివరకు ఆ అసౌకర్యం కోపంగా మారడంతో పార్వతి అందరి ముందు గట్టిగా కేకలు వేస్తూ.. “నేను పీరియడ్స్‌లో ఉన్నాను!” అని తెగేసి చెప్పిందట. అప్పటివరకు భయంతోనో, మొహమాటంతోనో ఆ నిజాన్ని దాచాలనుకున్న ఆమె, డైరెక్టర్ ప్రవర్తనతో విసిగిపోయి బహిరంగంగా స్పందించాల్సి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా పార్వతి నెలసరి అనేది ఒక సహజమైన జీవక్రియ అని, కానీ సమాజంలో అమ్మాయిలు దీనిని ఏదో పాపంగా, అవమానకరంగా భావిస్తూ దాచడానికి ప్రయత్నిస్తుంటారని పేర్కొన్నారు. పని చేసే చోట కనీస సౌకర్యాలు, తోటి మహిళల పట్ల అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె ఈ సంఘటన ద్వారా స్పష్టం చేశారు.