NTV Telugu Site icon

Rishabh Pant: పంత్‌ను రిటైన్‌ చేసుకుంటాం: పార్థ్‌ జిందాల్

Rishabh Pant Ipl 2025

Rishabh Pant Ipl 2025

ఐపీఎల్‌ 2025 మెగా వేలంకు ముందు ఫ్రాంఛైజీలు ఎంత మందిని రిటైన్‌ చేసుకోవచ్చనే దానిపై స్పష్టత వచ్చింది. ప్రతి ఫ్రాంఛైజీ ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ఐపీఎల్‌ పాలకవర్గం అనుమతిని ఇచ్చింది. ఇందులో ఓ రైట్‌ టు మ్యాచ్‌ (ఆర్‌టీఎం) ఉంది. నవంబర్‌లో వేలం జరిగే అవకాశాలు ఉన్నాయి. మెగా వేలానికి ముందు ఏ జట్టు ఎవరిని రిటైన్‌ చేసుకుంటుందనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. తమను రిషబ్ పంత్‌ను కచ్చితంగా రిటైన్‌ చేసుకుంటామని తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ సహ యజమాని పార్థ్‌ జిందాల్ వెల్లడించారు.

పార్థ్‌ జిందాల్ మాట్లాడుతూ… ‘కచ్చితంగా ఆరుగురిని రిటైన్‌ చేసుకుంటాం. ఢిల్లీ జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు. రిటెన్షన్‌ రూల్స్‌పై ఇప్పుడే స్పష్టత వచ్చింది. జీఎంఆర్‌, మా క్రికెట్‌ ఆఫ్‌ డైరెక్టర్ సౌరవ్ గంగూలీతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం. రిషబ్ పంత్‌ను మేం రిటైన్‌ చేసుకుంటాం. అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్‌, జేక్‌ ఫ్రేజర్‌ మెకెర్క్‌, కుల్దీప్ యాదవ్, అభిషేక్ పొరెల్, ముకేశ్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌.. లాంటి మంచి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. వేలంలో ఏం జరుగుతుందో చూడాలి. చర్చలు జరిపిన తర్వాత వేలానికి సిద్ధమవుతాం’ అని అన్నారు.

Also Read: T20 World Cup 2024: నేటి నుంచే టీ20 ప్రపంచకప్‌.. తొలి పోరులో బంగ్లాదేశ్‌తో స్కాట్లాండ్‌ ఢీ!

ప్రాంఛైజీలు తన రిటైన్‌ లిస్టును సమర్పించడానికి అక్టోబర్ 30 చివరి గడువు. 2016 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున రిషబ్ పంత్ ఆడుతున్న విషయం తెలిసిందే. 2021 నుంచి కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. 2022లో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్.. 2023 ఐపీఎల్ ఆడలేదు. ఐపీఎల్ 2024లో పునరాగమనం చేశాడు. బ్యాటర్, కెప్టెన్‌గా సత్తాచాటాడు.

 

Show comments