Telangana Floods : చీకటిలోనే పర్ణశాల రాముల వారి పూజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhadrachalam Sri Rama Parnashala area was filled with flood water
గత వారం తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. ఈ భారీ వర్షాలకు వాగులు వంకలు, చెరువులు నిండిపోయాయి. అంతేకాకుండా.. ఎగువన రాష్ట్రాల్లో సైతం భారీ వర్షాలు కురియడంతో.. తెలంగాణలోని జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. అంతేకాకుండా వరదలతో పలు గ్రామాలు జలదిగ్బంధలోకి వెళ్లాయి. కొన్ని గ్రామాలకు ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చి జిల్లాలోని ప్రజలపై భయాందోళనకు గురి చేసింది. అయితే గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరదలు వెనక్కి వెళ్లకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భద్రాద్రి జిల్లాలోని దుమ్మగూడెం పర్ణశాల ప్రాంతాలలో వరదల కారణంగా 10 రోజుల నుంచి కరెంట్‌ను కట్ చేశారు అధికారులు. దీంతో చీకటిలోనే పర్ణశాల రాముల వారి పూజలు నిర్వహిస్తున్నారు పూజారులు.
Google Play Store : ఈ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి..
Also Read
అయితే.. పది రోజుల నుంచి దుమ్ముగూడెం మండల ప్రజలు చీకట్లోనే ఉన్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. 10 రోజుల నుండి ఆలయంలో ఆకండ జ్యోతిలో రాములవారు దర్శనమిస్తున్నారు. పర్ణశాల రామాలయం చుట్టూ పాములు వస్తుండటంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తినడానికి తిండి కూడా లేక గ్రామస్తులు అలమటిస్తున్నారు. అంతేకాకుండా సీతమ్మ వారి నారా చీర, పసుపుకుంకుమ.. పరిసర ప్రాంతం వరద నీటిలోనే మునిగి ఉంది. వీటితో పాటు పర్ణశాల ప్రాంతాల్లో ఉన్న షాపులు నీట మునిగాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!