Site icon NTV Telugu

Crime News: పార్కింగ్ ప్లేస్ గొడవ.. కత్తులతో దాడి చేసుకున్న రౌడిషీటర్లు

Knife Attack

Knife Attack

Crime News: హైదరాబాద్ చంద్రాయణ్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పార్కింగ్ స్థలం విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన గొడవ.. కత్తులతో దాడి చేసుకునే వరకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. చంద్రాయణ్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్కాస్ సలాల లోని ఒక పార్కింగ్ స్థలం వద్ద చిన్న వివాదం మాట మాట పెరిగి కత్తులతో ఒకరిపై ఒకరు దాడికి దారి తీసింది.

Read Also: Komatireddy Venkat Reddy: నేనెప్పుడూ రానని చెప్పలేదే.. ఫోన్ చేస్తేనే వచ్చాను

గొడవపడిన వారు బాలాపూర్, చంద్రాయన్ గుట్ట పోలీస్ స్టేషన్ లకు చెందిన రౌడీషీటర్లు సులేమాన్ బౌమ్, అలీ బైసాగా గుర్తించారు. సులేమాన్ బౌమ్ పై కత్తితో దాడి చేసి అలీ బైసా అనే రౌడీషీటర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని దగ్గరలోని ఓవైసీ హాస్పిటల్ కి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇద్దరు రౌడీషీటర్లు వీరిపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయి.

Read Also: Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో విబేధాలు.. అలిగి వెళ్లిపోయిన వీహెచ్

Exit mobile version