Paralympics 2024 India Schedule Today: పారిస్ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు దుమ్మలేపుతున్నారు. ఇపటివరకు భారత్ ఖాతాలో 20 పతకాలు చేరాయి. ఇందులో మూడు స్వర్ణాలు, ఏడు రజతాలు, 10 కాంస్య పతకాలు ఉన్నాయి. పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇదివరకు 2020 టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ అత్యధిక పతకాలను (19-ఐదు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, ఆరు కాంస్యాలు) గెలుచుకుంది. ఆ రికార్డు ఇప్పుడు బ్రేక్ అయింది. నేడు కీలక పోటీలు ఉన్న నేపథ్యంలో మరిన్ని మెడల్స్ రానున్నాయి.
పారాలింపిక్స్‌లో నేటి షెడ్యూల్ ఇదే:
సైక్లింగ్:
పురుషుల సి-2 వ్యక్తిగత రోడ్ టైమ్ ట్రయల్ (పతక రౌండ్): అర్షద్ షేక్, రాత్రి.11.57
మహిళల సి1-3 వ్యక్తిగత రోడ్ టైమ్ ట్రయల్ (పతక రౌండ్): జ్యోతి గదెరియా, రాత్రి 12.32
షూటింగ్:
మిక్స్‌డ్ 50 మీటర్ల పిస్టల్ (క్వాలిఫికేషన్): నిహాల్ సింగ్, రుద్రాంశ్ ఖండేవాల్, మధ్యాహ్నం 1 గంటకు
అథ్లెటిక్స్:
పురుషుల షాట్‌పుట్ ఎఫ్-46 (పతక రౌండ్): మహ్మద్ యాసిర్, రోహిత్‌కుమార్, సచిన్ ఖిలోరి, మధ్యాహ్నం 1.35
మహిళల షాట్‌పుట్ ఎఫ్-46 (పతక రౌండ్): అమీషా రావత్, మధ్యాహ్నం 3.17 నుంచి
పురుషుల క్లబ్‌త్రో ఎఫ్-51 (పతక రౌండ్): ధర్మబీర్, ప్రణవ్, అమిత్‌కుమార్, రాత్రి.10.50
Also Read: BCCI: బీసీసీఐ సెలెక్షన్ కమిటీలో మార్పు.. మాజీ వికెట్ కీపర్ ఎంట్రీ!
టేబుల్ టెన్నిస్:
మహిళల సింగిల్స్, క్లాస్-4 (క్వార్టర్స్): భవీనా పటేల్ × యింగ్ (చైనా), మధ్యాహ్నం 2.15
పవర్ లిఫ్టింగ్:
పురుషుల 49 కేజీ (పతక రౌండ్): పరమ్‌జీత్ కుమార్, మధ్యాహ్నం 3.30
మహిళల 45 కేజీ (పతక రౌండ్): సకినా ఖాతున్, రాత్రి.8.30