NTV Telugu Site icon

Paris Paralympics 2024: హైజంప్‌లో భారత్ కు 2 పతకాలు..

Paris Paralympics 2024

Paris Paralympics 2024

Paris Paralympics 2024: సెప్టెంబర్ 3న (మంగళవారం) పారిస్ పారాలింపిక్స్ 2024 లో హైజంప్ T-42 విభాగంలో భారత్ ఒక రజత పతకాన్ని, కాంస్య పతకాన్ని గెలుచుకుంది. శరద్ కుమార్ భారత్‌కు రజత పతకాన్ని అందించగా, మరియప్పన్ తంగవేలు కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ గేమ్‌లో అమెరికాకు చెందిన ఎజ్రా ఫ్రెచ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. అతను 1.94 మీటర్ల దూరంతో కొత్త పారాలింపిక్ రికార్డును కూడా సృష్టించాడు. ఇక ఈ ఈవెంట్ లో 32 ఏళ్ల శరద్ ఫైనల్ మ్యాచ్‌లో 1.88 మీటర్ల ఎత్తు జంప్ చేసి రజత పతకం సాధించాడు. మరోవైపు మరియప్పన్ 1.85 మీటర్ల ఎత్తుతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్‭కు కోపం.. ముప్పై మంది అధికారులకు ఉరి..
ఇకపోతే మరియప్పన్ వరుసగా 3 పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు, ఈ మరియప్పన్ రియో ​​పారాలింపిక్స్ 2016లో బంగారు పతకాన్ని, టోక్యో పారాలింపిక్స్‌ లో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఇకపోతే పతకాలను సాధించిన శరద్‌ కు రెండేళ్ల వయసులో పోలియో సోకింది. మరియప్పన్ 5 సంవత్సరాల వయస్సులో రోడ్డు ప్రమాదంలో అతనిపై నుండి బస్సు దూసుకుపోయింది. దీని తర్వాత అతని కుడి కాలు వైకల్యం చెందింది. ఇక మంగళవారం ముగిసే సమయానికి భారత్ పతకాల సంఖ్య 20కి చేరుకుంది. పారాలింపిక్స్ చరిత్రలో ఇప్పటివరకు భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. పారిస్ పారాలింపిక్స్‌లో ఇద్దరు భారత క్రీడాకారులు ఒకేసారి పోడియం పైకి వచ్చి మెడల్స్ తీసుకోవడం ఇది నాలుగోసారి.