Site icon NTV Telugu

Vinesh Phogat Hospitalised: వినేశ్‌ ఫొగాట్‌కు తీవ్ర అస్వస్థత.. పారిస్‌లోని ఆస్పత్రికి తరలింపు!

Vinesh Phogat Hospitalised

Vinesh Phogat Hospitalised

Vinesh Phogat hospitalised in Paris due to Dehydration: పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో భారత స్టార్‌ మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. 50 కేజీల రెజ్లింగ్ పోటీల్లో ఫైనల్‌కు దూసుకెళ్లిన వినేశ్‌.. 100 గ్రాముల ఓవర్ వెయిట్ (అధిక బరువు) ఉన్న కారణంగా వేటు పడింది. ఈ విషయాన్ని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) కూడా ధ్రువీకరించింది. వినేష్‌కి స్వర్ణ పతకం సాధించే అవకాశం ఉండగా.. ఇప్పుడు రజత పతకాన్ని కూడా కోల్పోయారు. అయితే భారత రెజ్లర్‌ అస్వస్థత కారణంగా పారిస్‌లోని ఆస్పత్రిలో చేరారు.

మహిళల 50 కేజీల విభాగంలో బుధవారం రాత్రి జరిగే ఫైనల్‌లో అమెరికా స్టార్ రెజ్లర్ సారా హిల్డర్‌బ్రాంట్‌తో వినేశ్‌ ఫొగాట్‌ తలపడాల్సి ఉంది. అయితే మంగళవారం రాత్రే తాను ఎక్కువ బరువు ఉన్నానని వినేశ్‌ తెలుసుకున్నారు. బరువు తగ్గడం కోసం రాత్రంతా వర్కౌట్స్ చేశారు. నిద్రాహారాలు మానేసి.. స్కిప్పింగ్, సైక్లింగ్, జాగింగ్ చేశారు. దాంతో రాత్రే కేజీకి పైగా బరువు తగ్గారు. అయినప్పటికీ 100 గ్రాముల బరువు అధికంగా ఉండడంతో అనర్హత వేటు పడింది.

Also Read: Lava Yuva Star Price: లావా నుంచి సూపర్ స్మార్ట్‌ఫోన్‌.. 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ! ధర 7 వేలే

రాత్రంతా వర్కౌట్స్ చేయడంతో వినేశ్‌ ఫొగాట్‌ డీహైడ్రేషన్‌కు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను భారత ఐఓఏ అధికారులు హుటాహుటిన పారిస్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని సమాచారం. డీహైడ్రేషన్‌ కారణంగా స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది.

Exit mobile version