NTV Telugu Site icon

Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌లో 11 ఏళ్ల చిన్నారి.. ఆల్‌టైమ్ లిస్ట్‌లో ఎవరున్నారో తెలుసా?

Zheng Haohao

Zheng Haohao

Zheng Haohao is Youngest Olympian in Paris 2024: విశ్వ క్రీడలకు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో పారిస్ ‘ఒలింపిక్స్’ అధికారికంగా ఆరంభం కానున్నాయి. ఈరోజు రాత్రి 11 గంటల నుంచి ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా మొదలుకానున్నాయి. పారిస్‌లో ప్రవహించే సీన్ నదిపై ప్రారంభోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాల నుంచి 10 వేల మందికి పైగా అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. ఇందులో 11 ఏళ్ల చిన్నారి కూడా ఉండడం విశేషం.

పారిస్ ఒలింపిక్స్‌లో చైనాకు చెందిన 11 ఏళ్ల చిన్నారి జెంగ్ హావోహావో పాల్గొంటోంది. మహిళల స్కేట్‌ బోర్డింగ్ ఈవెంట్‌లో జెంగ్ పాల్గొనుంది. దాంతో పారిస్ విశ్వక్రీడల్లో పాల్గొనే అత్యంత పిన్నవయస్కురాలిగా రికార్డుల్లోకి ఎక్కింది. ఒలింపిక్స్‌ ఆల్-టైమ్ లిస్ట్‌లో మాత్రం డిమిట్రియోస్ లౌండ్రాస్ ఉన్నాడు. గ్రీకు జిమ్నాస్ట్ అయిన లౌండ్రాస్ 1896లో 10 సంవత్సరాల 218 రోజుల వయస్సులో ఒలింపిక్స్‌లో ఆడారు.

Also Read: Katrina Kaif: వాట్‌ ఏ ఫిల్మ్‌.. విజయ్‌ సినిమాపై కత్రినా కైఫ్‌ పొగడ్తలు!

ఇక భారత జట్టులో అత్యంత చిన్న వయస్సు అథ్లెట్‌గా స్విమ్మర్ ధినిధి దేషింగు పారిస్‌ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతోంది. ధినిధి వయస్సు 14 ఏళ్లు. ఒలింపిక్ చరిత్రలో పిన్న వయస్సులో బరిలోకి దిగుతున్న రెండో భారత్ ప్లేయర్‌గా ధినిధి చరిత్ర సృష్టించింది. స్విమ్మర్ ఆర్తి సాహా 11 సంవత్సరాల వయస్సులో 1952 ఒలింపిక్స్‌లో మహిళల 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో పాల్గొంది.