Ukrainian high jumper Yaroslava Mahuchikh takes a nap before competition: పారిస్ ఒలింపిక్స్ 2024లో ఉక్రెయిన్ మహిళా హై జంపర్ యారోస్లావా మహుచిఖ్ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. మహిళల హై జంప్ ఫైనల్స్‌లో 2.10 మీటర్లను క్లియర్ చేసి గోల్డ్ మెడల్ ఖాతాలో వేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన నికోలా ఒలిస్లేగర్స్ రెండో స్థానంలో నిలిచి రజతం సాధించగా.. ఆస్ట్రేలియాకే చెందిన ఎలినల్ పాటర్‌స్ కాంస్య పతకం గెలుచుకుంది.
యారోస్లావా మహుచిఖ్ ఫైనల్ పోటీకి ముందు ఓ కునుకు తీసింది. ఫైనల్స్‌లో తన పేరు ప్రకటించే వరకు తన బ్యాగ్‌పై సేద తీరింది. తన పేరు ప్రకటించగానే.. మహుచిఖ్ నిద్రలో నుంచి లేచి నేరుగా వెళ్లి హైజంప్ చేసింది. ఇందుకు సంబదించిన వీడియోస్, ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. కునుకు తీసి గోల్డ్ మెడల్ కొట్టిన ఆమెపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. కెరీర్‌లో మహుచిఖ్‌కు ఇదే తొలి బంగారు పతకం కావడం విశేషం. టోక్యో ఒలింపిక్స్‌లో 2 మీటర్ల ఎత్తును క్లియర్ చేయని ఆమె రజత పతకం గెలిచింది.
Also Read: Amazon Offers: అమెజాన్ ‘గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్’ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్!
పోటీకి ముందు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా రిలాక్స్ అయ్యేందుకే కునుకు తీసానని గోల్డ్ మెడల్ గెలిచాక యారోస్లోవా మహుచిఖ్ చెప్పుకొచ్చింది. 2018లో యూత్ ఒలింపిక్ గేమ్స్ నుంచి తాను ఇలానే చేస్తున్నాని తెలిపింది. కొన్నిసార్లు 1,2,3,4 అంటూ అంకెలను లెక్కిస్తానని.. మరికొన్నిసార్లు గట్టిగా ఊపిరి పీల్చుకుంటానని చెప్పింది. ఎప్పుడూ యోగా మ్యాట్, స్లీపింగ్ బ్యాగ్, హూడీ మరియు స్పేర్ సాక్స్‌లను పోటీలకు తీసుకువెళుతుందని మహుచిఖ్ కోచ్ సెర్హీ స్టెపనోవ్ చెప్పాడు. ప్రతి సీజన్‌లో కొత్త స్లీపింగ్ బ్యాగ్‌ని కొంటుందని చెప్పుకొచ్చాడు.