NTV Telugu Site icon

Paris Olympics 2024: ఎవరు ఈ సరబ్జోత్ సింగ్.?

Sarabjot Singh

Sarabjot Singh

Paris Olympics 2024 Sarabjot Singh: పారిస్ ఒలింపిక్స్ 2024 లో షూటింగ్ జోడి మను భాకర్, సరబ్జోత్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో ఈ జంట 16-10తో దక్షిణ కొరియాకు చెందిన జిన్ ఓహ్, వోన్హో లీ జోడీని ఓడించింది. ప్రస్తుతం జరుగుతున్న గేమ్స్‌లో మనుకి ఇది రెండో పతకం కాగా., సరబ్జోత్ తొలిసారి ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్నాడు. ఇకపోతే సరబ్జోట్ ప్రయాణం గురించి తెలుసుకుందాం. సరబ్జోత్ అంబాలాలోని ధీన్ గ్రామ నివాసి. అతని తండ్రి జతీందర్ సింగ్ ఒక రైతు. తల్లి హర్దీప్ కౌర్ గృహిణి. ఆయన చండీగఢ్‌ లోని DAV కాలేజీలో చదివాడు. కోచ్ అభిషేక్ రాణా ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్నాడు. సరబ్‌ జోట్‌ కు 12-13 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు వేసవి శిబిరంలో కొంతమంది పిల్లలు ఎయిర్ గన్‌ లను కాల్చడం చూశాడు. అప్పటి నుంచి అతను ఈ గేమ్‌ పై ఆసక్తి చూపాడు.

Stock Markets: లాభాలతో ముగిసిన సూచీలు..

2019లో సరబ్జోత్ జూనియర్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకోవడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. అతను 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో 239.6 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచాడు. ఆసియా ఛాంపియన్షిప్ 2023లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్‌ లో కాంస్య పతకాన్ని గెలుచుకోగా.. పారిస్‌ ఒలింపిక్స్‌ కోటా సాధించాడు. భోపాల్‌లో జరిగిన ISSF ప్రపంచ కప్ 2023లో వ్యక్తిగత ఈవెంట్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. బాకులో జరిగిన 2023 ప్రపంచకప్‌లో మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. టీమ్ ఈవెంట్‌లో 1 బంగారు పతకం, జూనియర్ ప్రపంచ కప్ 2022 మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లలో రజత పతకం గెలుచుకున్నాడు.

Rashid Khan: రషీద్ ఖాన్ @600 వికెట్లు..

సరబ్జోత్ తన మొదటి ఒలింపిక్స్‌లో ఆడుతున్నాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్‌లో 577-16x స్కోర్‌తో 33 మంది అథ్లెట్లలో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. అతను ఎనిమిదో స్థానంలో నిలిచిన జర్మనీకి చెందిన రాబిన్ వాల్టర్‌ ను పాయింట్లతో ఫైనల్ స్థానం కోల్పోయాడు. టాప్ 8 షూటర్లు మాత్రమే ఫైనల్స్‌కు చేరుకుంటారు. ఏ సమయంలో తన గత తప్పుల నుండి పాఠాలు తీసుకుంటూ సరబ్జోత్ మనుతో కలిసి పతకాన్ని గెలుచుకోవడంలో విజయం సాధించాడు. సరబ్‌జోత్‌, మనుల జోడీ భారత్‌కు షూటింగ్ లో ఒలింపిక్‌ చరిత్రలో ఆరో పతకాన్ని అందించింది. పారిస్ ఒలింపిక్స్ వ్యక్తిగత ఈవెంట్‌లో మను కాంస్య పతకాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. 2008లో అభినవ్ బింద్రా స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు . వ్యక్తిగతంగా స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా కూడా నిలిచాడు. ఇతడితో పాటు రాజ్యవర్ధన్ సింగ్ 2004లో రజతం, గగన్ నారంగ్ 2012లో కాంస్యం, విజయ్ కుమార్ 2012లో రజతం షూటింగ్‌లో ఒలింపిక్ పతకాలు సాధించిన ఇతర భారత ఆటగాళ్లు.