Site icon NTV Telugu

Paris Olympics 2024: ఒలింపిక్స్‌ లోగోలోని 5 రింగుల అర్థం అదేనా?

Olympics 2024

Olympics 2024

Paris Olympics 2024: మనకు ఒలింపిక్స్ అనగానే ముందుగా 5 రింగ్స్ సింబల్ గుర్తొస్తుంది. 2024 ఒలింపిక్ క్రీడలు జూలై 26 నుండి మొదలై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. సుమారు 10 వేల మంది అథ్లెట్లు ఇందులో పాల్గొనబోతున్నారు. ఇకపోతే ఒలంపిక్స్ చరిత్రను పరిశీలిస్తే 1896లో ఈ విశ్వ క్రీడలు ప్రారంభమయ్యాయి. చాలాకాలంగా ఈ ఆటలకు ప్రతీక అయిన 5 వృత్తాకార వలయాలను మనం చూస్తున్నాము. ఈ ఆటలు ప్రారంభమై ఒక శతాబ్దానికి పైగా గడిచింది. అయితే కేవలం 5 రింగ్‌ లు ఎందుకు.? వాటి అర్థం ఏమిటి అనేది ఇప్పటికి చాలామందికి ఓ పెద్ద ప్రశ్న.

Jio Plans: జియో 3 కొత్త చౌకైన ప్లాన్‌లు.. అపరిమిత కాలింగ్, డేటాతో పాటు ఓటీటీలు కూడా..

ఎడమ నుండి కుడికి క్రమంలో ఈ 5 రింగుల రంగులు నీలం, పసుపు, నలుపు, ఆకుపచ్చ, ఎరుపుగా ఉంటాయి. ఈ 5 రింగులను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (IOC) మాజీ అధ్యక్షుడు పియరీ డు కూబెర్టిన్ రూపొందించారు. ఈ 5 రింగ్స్ సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఒలింపిక్ ఉద్యమానికి ప్రతీక. ఒలింపిక్ రింగులు ప్రపంచంలోని 5 ప్రధాన ఖండాలకు ప్రతీక. ఆఫ్రికా, ఉత్తర & దక్షిణ అమెరికా, ఆసియా, యూరప్, ఆస్ట్రేలియా ఖండం చుట్టూ ఉన్న అన్ని దేశాలు ఒకే ఖండంగా లెక్కించబడ్డాయి.

Paris Olympics 2024: ప్రీ-క్వార్టర్స్‌లోకి భజన్ కౌర్.. క్వార్టర్-ఫైనల్‌కు సాత్విక్-చిరాగ్

ఒలింపిక్స్‌ కు చిహ్నాలుగా ఉపయోగించే ఈ 5 రింగులకు వేర్వేరు రంగులు కూడా వేర్వేరు అర్థాలను కలిగి ఉంటాయి. ఈ ఐదు ఒలింపిక్ రింగులను పియరీ డి కూబెర్టిన్ తయారు చేశారు. పియరీ డి కూబెర్టిన్‌ను ఒలింపిక్ క్రీడల సహ వ్యవస్థాపకుడిగా కూడా పిలుస్తారు. ఈ ఐదు రింగులను 1912 సంవత్సరంలో రూపొందించబడ్డాయి. ఇవి 1913 సంవత్సరంలో బహిరంగంగా ఆమోదించబడినప్పటికీ., వీటిలో బ్లూ కలర్ రింగ్ ఐరోపాకు, పసుపు రంగు ఆసియాకు, నలుపు రంగు ఆఫ్రికాకు, ఆకుపచ్చ రంగు ఆస్ట్రేలియా, ఎరుపు రంగు అమెరికాకు చిహ్నం.

Exit mobile version