Manu Bhaker: పారిస్ ఒలింపిక్స్ 2024.. చరిత్రకు అడుగు దూరంలో మను బాకర్!
- కాంస్య పతకం గెలిచిన మను బాకర్
- మరో పోరుకు సిద్ధమైన మను
- మను చరిత్ర సృష్టిస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shooter Manu Bhaker on Cusp of history in Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మహిళా షూటర్ మను బాకర్ తొలి పతకం అందించిన విషయం తెలిసిందే. వ్యక్తిగత విభాగం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో మను కాంస్య పతకం గెలిచింది. భారత్‌కు పతకం అందించిన ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక మను బాకర్ నేడు మరో పోరుకు సిద్ధమైంది.10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పోరులో సరబ్‌జ్యోత్‌తో కలిసి బరిలోకి దిగనుంది. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు దక్షిణ కొరియా ద్వయం లీ-యెజిన్‌తో భారత్ జోడీ తలపడనుంది.
నేడు జరిగే మిక్స్‌డ్ టీమ్ పోరులో గెలిచి కాంస్య పతకం దక్కించుకుంటే.. మను బాకర్ అరుదైన రికార్డు అందుకుంటుంది. స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్‌గా చరిత్రలో నిలుస్తుంది. భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు 1900 ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌లో నార్మన్ ప్రిచర్డ్ రెండు రజత పతకాలు గెలిచాడు. బ్రిటీష్-ఇండియన్ అథ్లెట్ అయిన ప్రిచర్డ్.. 1900 ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అతడి తర్వాత ఏ భారత అథ్లెట్ ఒక ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించలేదు.
Also Read
Also Read: Paris Oympics 2024: చరిత్ర సృష్టించిన భారత ప్లేయర్ మనికా బత్రా!
అయితే కెరీర్‌లో మాత్రం ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత అథ్లెట్లు ఇద్దరు ఉన్నారు. అందులో ఒకరు సుశీల్ కుమార్ కాగా.. ఇంకొకరు తెలుగు తేజం పీవీ సింధు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకంను రెజ్లర్ సుశీల్ సాధించాడు. బ్యాడ్మింటన్ ప్లేయర్ సింధు 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2021 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచింది. ఇప్పుడు మను బాకర్ చరిత్రకు అడుగు దూరంలో ఉంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!