NTV Telugu Site icon

Paris Olympics 2024: భారత జట్టుకు ఒలింపిక్‌ కమిటీ షాక్‌.. సెమీస్‌ నుంచి కీలక ప్లేయర్‌ ఔట్!

Amit Rohidas

Amit Rohidas

Indian Hockey Player Amit Rohidas Miss semi-finals match against Germany: పారిస్ ఒలింపిక్స్‌ 2024లో సెమీస్‌కు చేరిన ఆనందంలో ఉన్న భారత హాకీ జట్టుకు ఒలింపిక్‌ కమిటీ భారీ షాక్‌ ఇచ్చింది. కీలక ప్లేయర్‌ అమిత్ రోహిదాస్‌పై కమిటీ ఓ మ్యాచ్‌ వేటు వేసింది. దాంతో మంగళవారం జర్మనీతో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌కు అతడు దూరం అయ్యాడు. ఆదివారం జరిగిన క్వార్టర్స్‌లో ఉద్దేశపూర్వకంగానే బ్రిటన్‌ ఆటగాడికి స్టిక్‌ తగిలించాడని డిఫెండర్‌ రోహిదాస్‌పై ఓ మ్యాచ్ నిషేధం విధించింది.

క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో గోల్‌ కోసం బ్రిటన్‌ ప్లేయర్ విల్ కాల్నాన్‌తో అమిత్ రోహిదాస్ పోటీ పడ్డాడు. ఈ క్రమంలో రోహిదాస్ హాకీ స్టిక్.. కల్నాన్ ముఖానికి తాకింది. ఆన్-ఫీల్డ్ రిఫరీ దీనిని తీవ్రమైన నేరంగా పరిగణించడంతో రోహిదాస్‌ ఎర్ర కార్డు అందుకుని బయటకు వెళ్లాల్సి వచ్చింది. భారత్ 10 మందితోనే బ్రిటన్‌ను ఎదుర్కొని అద్భుత విజయం సాధించింది.తాజాగా రోహిదాస్‌పై వేటు పడటంతో భారత హాకీ సంఘం తీవ్రంగా స్పందించింది. ఇలాంటి ఘటనలతో ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందని పేర్కొంది. క్రీడ సమగ్రతను నిలబెట్టడానికి, భవిష్యత్‌లో జరగబోయే మ్యాచ్‌లనైనా సరిగ్గా జరిగేలా సమీక్షించాలని కోరింది.

Also Read: Amazon Sale 2024: అమెజాన్‌లో మరో సేల్‌.. డేట్స్, ఆఫర్స్ ఇవే!

ఫుట్‌బాల్‌, హాకీలో నిబంధనలు వేరుగా ఉంటాయి. ఫుట్‌బాల్‌లో రెడ్ కార్డు అందుకున్న ఆటగాడు తర్వాతి మ్యాచ్‌ ఆడకుండా నిషేధం పడుతుంది. హాకీలో ముందుగా సాంకేతిక బృందానికి అంపైర్‌ సంఘటన గురించి నివేదిక అందిస్తాడు. వీడియోను పరిశీలించి.. ఆటగాడు ఉద్దేశపూర్వకంగా తప్పు చేశాడో లేదో అని సాంకేతిక బృందం పరిశీలిస్తుంది. ఆటగాడు ఉద్దేశపూర్వకంగానే ఫౌల్‌ చేశాడని భావిస్తే.. అతనిపై ఓ మ్యాచ్‌ నిషేధం పడుతుంది. ఇక సెమీస్‌లో భారత్‌, జర్మనీ మధ్య మంగళవారం రాత్రి 10.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.

Show comments