Site icon NTV Telugu

Parineeti Chopra : ఏప్రిల్ 10న పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా నిశ్చితార్థం ?

Parineeti

Parineeti

Parineeti Chopra : అపరిమిత అందంతో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు పరిణీతి చోప్రా. పన్నెండేండ్ల కెరీర్‌లో పలు హిట్ చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో క్రేజ్‌ను సొంతం చేసుకుంది. త్వరలోనే పరిణీతి పెళ్లి పీటలెక్కబోతున్నట్లు సమాచారం. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చందా, నటి పరిణీతి చోప్రాలు ప్రేమలో వున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరిరు కలిసి ముంబయిలో చాలా ఈవెంట్స్‌కు హాజరయ్యారు. అయితే తన ప్రేమ వ్యవహారం గురించి ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు పరిణీతి. వారు మార్చి 22న డిన్నర్ డేట్‌కి బయటకు వెళ్లి, మరుసటి రోజు లంచ్ కోసం మళ్లీ కలుసుకున్నారు. ఇద్దరూ ఇదే విషయంపై పెదవి విప్పినప్పటికీ.. పరిణీతి, రాఘవ్ త్వరలో తమ ఎంగేజ్ మెంట్ జరుపుకోనున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి.

Read Also: Chiken Curry : కోడి కూర.. కొడుకును చంపేలా చేసింది

రాఘవ్, పరిణీతి ఇద్దరూ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో కలిసి చదువుకున్నారు. వీరికి చాలా మంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం మరో వారం రోజుల్లో ఈ జంటకు నిశ్చితార్థం జరగనున్నట్లు తెలిసింది. ఢిల్లీలో ఎంగేజ్‌మెంట్‌ కోసం ఏర్పాటు జరుగుతున్నాయని చెబుతున్నారు. నిశ్చితార్థం కోసం పరిణీతి చోప్రా షూటింగ్స్‌ను వాయిదా వేసుసుంది. ప్రస్తుతం ఈ భామ హిందీలో ఛమ్కీలా, క్యాప్య్సుల్‌ గిల్‌ చిత్రాల్లో నటిస్తున్నది. ముంబై, న్యూఢిల్లీ విమానాశ్రయాలలో ఇద్దరూ తరచుగా కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దర్శకుడు మనీష్ శర్మతో పరిణీతి డేటింగ్‌లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ విడిపోయి దాదాపు ఏడాది కావస్తోంది.

Exit mobile version