Chiken Curry : కోడి కూర.. కొడుకును చంపేలా చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiken Curry : కోడి కూర కోసం తండ్రీకొడుకుల మధ్య గొడవ జరిగింది. ఈ వివాదంలో తండ్రి కొడుకును బలితీసుకుండు. ఇంట్లో వండిన కోడి కూర మొత్తం తండ్రి తినేయడంతో కొడుకు గొడవకు దిగాడు. ఈ విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది చివరకు ఘర్షణకు దారితీసింది. కోపంతో ఊగిపోయిన తండ్రి ఇంటిలో ఉన్న కర్రతో కొడుకు తల పగులగొట్టాడు. తీవ్రంగా గాయపడిన కుమారుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా సూళ్య తాలూకా మోగ్ర గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. చనిపోయిన యువకుడి పేరు శివరామ్. శివరామ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన తండ్రి పేను షీనా. శివరామ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు.
Read Also: Cunning Friend : ఫ్రెండ్ అని నమ్మితే.. పెళ్లికి పనికి రాకుండా చేశాడు
Also Read
- Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
మంగళవారం పనిమీద బయటకు వెళ్లిన శివరామ్ రాత్రి ఇంటికి తిరిగొచ్చాడు. ఇంట్లో కోడి మాంసం వండగా.. కుమారుడికి వదిలి పెట్టకుండా తండ్రి మొత్తం తినేశాడు. ఈ విషయమై తండ్రితో శివరామ్ గొడవ పడ్డాడు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. గొడవకు దారి తీసింది. కోపంతో ఊగిపోయిన షీనా.. పక్కనే ఉన్న దుడ్డుకర్ర తీసుకుని కుమారుని తలపై కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడి శివరామ్ అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన వల్ల ఇద్దరు పిల్లలు తండ్రి ప్రేమకు దూరమయ్యారు.
Read Also:Kotamreddy Sridhar Reddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గృహనిర్బంధం
తాజావార్తలు
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?