Site icon NTV Telugu

Medha School: ఈరోజు పరీక్షలు అంటూ మెసేజ్.. మేధా స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన..

Medha

Medha

బోయిన్ పల్లి మేధా స్కూల్ లో డ్రగ్స్ తయారీ తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఫ్యాక్టరీని తలపించేలా క్లాస్ రూమ్ లో రియాక్టర్లు ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ తయారీకి పాల్పడ్డాడు జయప్రకాశ్ గౌడ్. పక్కా సమాచారంతో ఈగల్ టీం తనిఖీలు చేపట్టగా డ్రగ్స్ తయారీ గుట్టు రట్టైంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే మేధా స్కూల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు భవిష్యత్తు అయోమయంలో పడినట్లైంది. డ్రగ్స్ కేస్ లో స్కూల్ సీజ్ చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో బోయిన్ పల్లి మేధా స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

Also Read:Dhanush: ఇడ్లీ కొట్టు ఆడియో లాంచ్‌లో..చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న ధనుష్

ఈ రోజు విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని మెసేజ్ రావడం తో స్కూల్ కు చేరుకున్న విద్యార్థులు. ఈరోజు పరీక్షలు అంటూ మెసేజ్ పెట్టి ఎవరు స్కూల్లో లేకుండా వెళ్లారని విద్యార్థుల తల్లి దండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు విద్యాశాఖ న్యాయం చేయాలని తల్లి దండ్రులు డిమాండ్ చేస్తున్నారు. సికింద్రాబాద్ బోయిన్‌పల్లి లో మేధా స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనలతో విద్యాశాఖ అధికారులు దిగివచ్చారు. స్కూల్ లో చదువుతున్న వారి వివరాలు సేకరించడంతో పాటు, వారిని మరో స్కూల్ కు ట్రాన్స్ఫర్ చేయడానికి చర్చించారు. సరైనా స్కూల్ లో చేర్పించి వారి భవిష్యత్ ను కాపాడుతామని ఎంఈవో హరిచందన్ తెలిపారు.

Exit mobile version