గత ఏడాది సెప్టెంబర్ 1న తమిళంలో థియేటర్లలో రిలీజైన పరంపోరుల్ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.చిన్న సినిమాగా విడుదలై పరంపోరుల్ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో అమితాశ్ ప్రధాన్ మరియు శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లేతో పాటు శరత్‌కుమార్ యాక్టింగ్‌కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. పరంపోరుల్ కథ మొత్తం పురాతన విగ్రహాల అక్రమ రవాణా నేపథ్యంలో సాగుతుంది.అయితే అదే టైమ్‌లో రజనీకాంత్ జైలర్ రిలీజ్ కావడం, రెండు సినిమాల మెయిన్ పాయింట్ ఒకటే కావడంతో పరంపోరుల్ మూవీ అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దాదాపు ఆరు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 15 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్నది. 2021లోనే పరంపొరుల్ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. కానీ అనివార్య కారణాల వల్ల షూటింగ్ డిలే అయ్యింది. రెండేళ్ల తర్వాత థియేటర్లలో రిలీజైంది.పరంపోరుల్ మూవీలో కశ్మీరా పరదేశీతో పాటు బాలాజీ శక్తివేల్ ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ చిన్న సినిమాకు యువర్ శంకర్ రాజా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. పరుంపొరుల్ మూవీకి సీ అరవింద్‌రాజ్ దర్శకత్వం వహించాడు.దర్శకుడిగా ఇదే అతడికి తొలి సినిమా కావడం. విశేషం.పరంపోరుల్ హీరో అమితాశ్ ప్రధాన్ తెలుగులో రామ్ చరణ్ బ్రూస్ లీ ది ఫైటర్‌తో పాటు నాగశౌర్య కృష్ణ వ్రింద విహారి సినిమాలో ముఖ్య పాత్ర పోషించాడు. పరంపోరుల్ సినిమాతోనే కెరీర్‌లో హీరోగా ఫస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు.ఇదిలా ఉంటే క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ మూవీ తాజాగా తెలుగులోకి వచ్చేస్తోంది.థియేటర్ల ద్వారా కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారా తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. జనవరి 18 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఆది (అమితాశ్ ప్రధాన్) నిజాయితీపరుడైన యువకుడు. డబ్బు అత్యవసరం కావడంతో పురాతన విగ్రహాల దొంగతనం చేసే ముఠాతో చేతులు కలుపుతాడు. పోలీస్ ఆఫీసర్ మైత్రేయన్‌తో (శరత్‌కుమార్) కలిసి పనిచేయడానికి అంగీకరిస్తారు. ఆ డీల్ ఆది జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పింది అన్నదే పరంపోరుల్ మూవీ కథ.