NTV Telugu Site icon

Paris Paralympics 2024: పారాలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్ ఇదే!

Paralympics 2024 India Schedule

Paralympics 2024 India Schedule

Paralympics 2024 India Schedule Today: పారిస్‌ పారాలింపిక్స్‌లో శుక్రవారం నాలుగు పతకాలు సాధించిన భారత్‌.. శనివారం ఒక పతకం మాత్రమే సాధించింది. షూటింగ్‌లోనే మరో పతకం దక్కింది. రుబీనా ఫ్రాన్సిస్‌ కంచు గెలవడంతో పతకాల సంఖ్యను ఐదుకు చేరింది. బ్యాడ్మింటన్‌లో కనీసం ఓ పతకం ఖాయమైంది. సుకాంత్, సుహాస్‌ నేడు సెమీస్‌లో తలపడనున్నారు. భారీ అంచనాలతో బరిలో దిగిన ఆర్చర్‌ శీతల్‌ నిరాశపర్చింది. వ్యక్తిగత విభాగంలో ప్రిక్వార్టర్స్‌లోనే ఆమె నిష్క్రమించింది. నేడు భారత్ ఖాతాలో మరిన్ని పతకాలు చేరే అవకాశాలు ఉన్నాయి.

భారత షెడ్యూల్:

పారా షూటింగ్‌:
మిక్స్‌డ్‌ 10మీ ఎయిర్‌ రైఫిల్‌ ప్రోన్‌ ఎస్‌హెచ్‌1 క్వాలిఫికేషన్‌ (సిద్ధార్థ, అవని)- మధ్యాహ్నం 1, ఫైనల్‌- సాయంత్రం 4.30;
మిక్స్‌డ్‌ 10మీ ఎయిర్‌ రైఫిల్‌ ప్రోన్‌ ఎస్‌హెచ్‌2 క్వాలిఫికేషన్‌ (శ్రీహర్ష)- మధ్యాహ్నం 3, ఫైనల్‌- సాయంత్రం 6.30

పారా అథ్లెటిక్స్‌:
పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌40 (రవి రొంగలి)- మధ్యాహ్నం 3.12,
పురుషుల హైజంప్‌ టీ47 (నిశాద్‌ కుమార్, రాంపాల్‌)- రాత్రి 10.40,
మహిళల 200మీ పరుగు టీ35 (ప్రీతి పాల్‌)- రాత్రి 11.27

పారా ఆర్చరీ:
పురుషుల వ్యక్తిగత కాంపౌండ్‌ ప్రిక్వార్టర్స్‌ (రాకేశ్‌ కుమార్‌)- రాత్రి 7.17,
పతక రౌండ్లు- రాత్రి 11.13 నుంచి