Site icon NTV Telugu

Papua New Guinea Earthquake: ద్వీప దేశంలో భూకంపం.. భయాందోళనలో ప్రజలు

Papua New Guinea Earthquake

Papua New Guinea Earthquake

Papua New Guinea Earthquake: ప్రశాంతంగా ఉన్న ప్రజల జీవితాల్లో భూకంపం ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది. ఇంతకీ ఈ భూకంపం ఎక్కడ సంభవించిందో తెలుసా.. ద్వీప దేశం అయిన పపువా న్యూ గినియాలో. మంగళవారం దేశంలోని తూర్పు న్యూ గినియా ప్రాంతంలో 6.7 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం మొత్తం ఆ ప్రాంతాన్ని కుదిపేసింది. యూరో-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) నివేదికల ప్రకారం.. స్థానిక సమయం 11:05 UTCకి భూకంపం వచ్చింది. భూమికి కేవలం 10 కిలోమీటర్ల దిగువన భూకంప కేంద్రం ఉందని నివేదికలు స్పష్టం చేశాయి.

READ ALSO: Naga Chaitanya : ఆ సినిమా తర్వాత నాగచైతన్యతో శోభిత గొడవ..

భూకంప కేంద్రం మొరోబ్ ప్రావిన్స్ రాజధాని లోయ్‌కి పశ్చిమాన 19 కిలోమీటర్ల దూరంలో ఉందని నివేదికలు తెలిపాయి. ఈ ప్రాంతం దేశంలోనే రెండవ అతిపెద్ద నగరం. ఇక్కడ దాదాపు 76,000 జనాభా నివసిస్తున్నారు. ఈ భూకంపం కారణంగా స్థానిక నివాసితులు భయంతో తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రాంతం మళ్లీ కూడా ప్రకంపనలకు గురయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో ప్రాణనష్టం లేదా సునామీ హెచ్చరిక గురించి ఎటువంటి నివేదికలు బయటికి రాలేదు.

READ ALSO: Why Indians Don’t Win Nobel: సి.వి.రామన్ తర్వాత మరో భారతీయుడికి నోబెల్ ఎందుకు రాలేదు..

Exit mobile version