Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!

Papikondalu Boating

Papikondalu Boating

Papikondalu Boating Begins Today: గోదావరి వరదల నేపథ్యంలో నిలిచిపోయిన పాపికొండల విహారయాత్ర నేటి నుంచి తిరిగి ప్రారంభమవుతుంది. సుమారు 70 రోజుల విరామం తర్వాత పర్యాటక బోట్లకు అధికారులు అనుమతులు జారీ చేశారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని గండిపోశమ్మ ఆలయం నుంచి పాపికొండలకు 16 టూరిజం బోట్లు ప్రయాణించనున్నాయి. ఏపీటీడీసీకి చెందిన ఓ బోట్, 15 ప్రైవేట్‌ బోట్లను విహారయాత్రకు సిద్ధంగా ఉంచారు.

గోదావరిలో వరద ఉద్ధృతి కారణంగా జులై 30 నుంచి బోటు ప్రయాణాలను నిలిపివేశారు. రెండు రోజుల క్రితం గోదావరి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం పరిస్థితులను పరిశీలించిన అనంతరం పాపికొండల విహారయాత్రకు అనుమతిస్తూ రంపచోడవరం సబ్‌ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు 2026 దసరా సెలవులు కొనసాగుతుండటంతో.. పాపికొండలను సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో పర్యాటక ప్రాంతంలో సందడి నెలకొంటుంది. బోట్‌ పాయింట్‌ వద్ద అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.