Papikondalu Boat Tourism: గోదావరి నదిపై పాపికొండల మధ్యలో విహారయాత్రకు ఎంతో అద్భుతంగా ఉంటుంది.. ఎత్తైన పాపికొండల మధ్య.. బోట్లలో విహరిస్తూ.. ఆ నేచర్‌ను ఎంజాయ్ చేయడమే కాదు.. బోట్లలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆకట్టుకుంటాయి.. అయితే, వర్షాకాలంలో గోదావరి పోటెత్తిన సమయంలో ప్రతీ ఏడాది పాపి కొండల టూర్ నిలిపివేస్తుంటారు.. ఎప్పుడు వర్షాలు తగ్గడం.. గోదావరిలో నీటి ప్రవాహం కూడా తగ్గుముఖం పట్టడంతో.. గోదావరి నదిపై పాపి కొండల విహారయాత్రకు ఇరిగేషన్ అధికారులు పచ్చజెండా ఊపారు. మూడు నెలలుగా వరదల కారణంగా నిలిచిపోయిన విహారయాత్రలు మళ్లీ ప్రారంభమవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యామ్ వద్ద నీటిమట్టం తగ్గడంతో ఇవాళ్టి నుంచి అనుమతులు ఇచ్చారు. దీనితో. నిర్వాహకులు పాపికొండలు విహారయాత్రకు వెళ్లే బోట్లను సిద్ధం చేస్తున్నారు. దేవీపట్నం మండలం గండిపోశమ్మ అమ్మ వారి ఆలయం నుంచి పాపికొండల విహారయాత్రకు వెళ్లడానికి 15 బోట్లు సిద్ధంగా ఉన్నాయి. మరో కొత్త బోటుకు అధికారులు అనుమతులు ఇవ్వాల్సి ఉంది. అయితే, పది రోజుల పాటు ఎక్కువ సామర్థ్యం ఉన్న బోట్లను విహారయాత్రకు పంపిస్తున్నారు. పర్యాటకుల భద్రత విషయంలో నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు పాటించేలా చర్యలు చేపట్టారు. దీంతో వీకెండ్ సెలవు దినాల్లో ఆహ్లాదకరంగా గడపాలని కోరుకునే పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు సిద్ధమవుతున్నారు.
Read Also: Raashi Khanna: సెట్స్‌లో సిద్ధూ ఇలా చేస్తాడని అనుకోలేదు.. చూసి షాక్ అయ్యా!
