Maharani of a Royal family in Panna Arrested: మధ్యప్రదేశ్ పన్నాలోని రాజకుటుంబానికి చెందిన మహారాణి జితేశ్వరి దేవిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. జన్మాష్టమి సందర్భంగా 300 ఏళ్ల ప్రసిద్ధ ఆలయం భగవాన్ జుగల్ కిషోర్ ఆలయంలో పూజలు చేయడానికి వెళ్లారు మహారాణి జితేశ్వరి దేవి. అయితే అక్కడ ఆమె దేవుడికి పూజలు చేయడానికి సిద్ధమయ్యారు. గర్భగుడిలోకి స్వయంగా వెళ్లడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఆమె కిందపడిపోయారు. అయితే గుడి నిబంధనల ప్రకారం మగవారు మాత్రమే గర్భగుడిలోకి వెళ్లాలి. అయితే ఆలయ సిబ్బంది ఎంత చెబుతున్నా వినకుండా ఆమె గర్భ గుడిలోకి వెళ్లడానికి ప్రయత్నించడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆమెను అడ్డుకోవడానికి ఆలయ సిబ్బంది, పోలీసులు ప్రయత్నించారు. దీంతో అక్కడ పెద్ద సీన్ క్రియేట్ అయ్యింది. అక్కడ జరగాల్సిన కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది.
Also Read: Harassment: ఆ స్టార్ హీరో సినిమాలు చూస్తున్నందుకు భార్యను కొట్టిన భర్త.. పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు
దీంతో ఆలయ కార్యక్రమాలు జరిగే వేళ బందోబస్తు కోసం వచ్చిన పోలీసులు ఆమెను అక్కడి నుంచి లాకెళ్లి అరెస్ట్ చేశారు. ఆమె పోలీసులతో వ్యహరించిన తీరు, ఆమెను పోలీసులు లాకెళ్లిన విధానం అన్నింటికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గుడిలో కార్యక్రమాలకు ఇబ్బంది కలిగించి, గొడవ క్రియేట్ చేసిన కారణంగా జితేశ్వరి దేవి పై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 295A, 353 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆమె బెయిల్ కోసం ప్రయత్నించగా శుక్రవారం రాకపోవడంతో ఓ రాత్రంతా ఆమె జైలులో గడపాల్సివచ్చింది. ఇక శనివారం బెయిల్ మంజూరు కావడంతో ఆమె విడుదలయ్యారు. అయితే పన్నాలో రూ.65 వేల కోట్ల విలువైన డిఫెన్స్ వెల్ఫేర్ ఫండ్ అవినీతి జరిగిందని, కేసు కోర్టులో ఉందని ఆమె అన్నారు. గతంలో కూడా మహారాణి జితేశ్వరి దేవిపై ఆమె అత్తగారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రెండేళ్ల క్రితం అరెస్ట్ చేశారు.