NTV Telugu Site icon

Pankaja Munde: ఎక్కి ఎక్కి ఏడ్చిన పంకజా ముండే

Bjp

Bjp

ఎవరైనా ఆప్తుల్ని కోల్పోతే.. ఆ కుటుంబంలో ఎంతో బాధ, దు:ఖం ఉంటుంది. కొన్ని రోజులు పాటు ఆ ఇల్లంతా విషాదంలో ఉంటుంది. ఇక బంధువులు, స్నేహితులు ఎవరైనా పరామర్శకు వస్తుంటే.. మళ్లీ మళ్లీ జ్ఞాపకం చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు. తాజాగా ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన బీజేపీ నాయకురాలు కూడా ఆ కుటుంబంలో జరిగిన విషాదాన్ని గుర్తుచేసుకుని ఎక్కి ఎక్కి ఏడ్చేశారు. కొంత సేపు అలా ఏడుస్తూనే ఉండిపోయారు. దు:ఖాన్ని ఆపుకోలేక ఏడుస్తూనే ఉన్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

మహారాష్ట్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు పంకజా ముండే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీడ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగారు. అయితే ఆమె ఓటమి పాలయ్యారు. శరద్‌పవర్ పార్టీకి చెందిన అభ్యర్థి బజరంగ్ మనోహర్ సోన్వానే చేతిలో ఆమె ఘోర పరాజయం పాలయ్యారు. అయితే ఆమె ఓటమిని తట్టుకోలేక నలుగురు అభిమానాలు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆమె బాధిత కుటుంబాలను పరామర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఓ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు కార్యకర్తలతో కలిసి వెళ్లింది. అక్కడ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తుండగా.. వారి బాధల్ని విని దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. దీంతో ఆమె ఎక్కి ఎక్కి ఏడ్చేశారు. సహచరులు ఎంత నచ్చచెప్పినా కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఆమెతో పాటు కార్యకర్తలు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా జరిగిన లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి బీజేపీ తన ప్రభావాన్ని చూపించలేకపోయింది. కేవలం 9 స్థానాల్లో మాత్రమే గెలిచింది. 48 లోక్‌సభ స్థానాల్లో ఇండియా కూటమి భారీగా సీట్లు సంపాదించింది.