Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!

Rajanna Sircilla

Rajanna Sircilla

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కాలనీలో పానీపూరి తిన్న సుమారు 10 మందికి పైగా చిన్నారులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. పానీపూరి తిన్న కొద్దిసేపటికే చిన్నారులు కడుపునొప్పి, వాంతులు, విరోచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వారిని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం బాధితులకు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పలు ప్రైవేటు ఆసుపత్రులలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఒకేసారి ఇంతమంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

×
×
Ad