Site icon NTV Telugu

Prabhas : మరోసారి 35 లక్షలను డొనేట్ చేసిన రెబల్ స్టార్..

Prabhas (4)

Prabhas (4)

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. గత సంవత్సరం సలార్ సినిమాతో హిట్ కొట్టిన ప్రభాస్ త్వరలో కల్కి సినిమాతో రాబోతున్నాడు.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కాగా ప్రభాస్ మంచి మనసు గురించి తెలిసిందే. షూటింగ్ లో, లేదా తన ఇంటికి ఎవరు వచ్చినా కడుపు నిండా భోజనం పెట్టి మరీ పంపిస్తాడు. ప్రభాస్ పెట్టే భోజనం గురించి ఎంతోమంది హీరోలు, హీరోయిన్స్, సెలబ్రిటీలు మాట్లాడుతూనే ఉంటారు.. తాజాగా మరోసారి మంచి మనసు చాటుకున్నాడు.

ప్రభాస్ తనకు నచ్చిన వారికి డొనేషన్స్ ఇస్తుంటారు.. తాజాగా డైరెక్టర్స్ కు డొనేషన్ ఇచ్చాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 45 లక్షలను డొనేట్ చేసి భళా అనిపించుకున్నాడు.. ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ మే 4న దాసరి నారాయణరావు పుట్టినరోజు వేడుకను ప్రతి ఏటా నిర్వహిస్తున్న డైరెక్టర్స్ డేని ఈ సారి ఘనంగా నిర్వహించబోతున్నారు. స్టేడియంలో భారీ ఏర్పాటు చేస్తున్న ఈ ఈవెంట్ కు సినీ ప్రముఖులు అంతా హాజరు కానున్నారు.

ఈ ఈవెంట్ అనౌన్స్ మెంట్ వేడుకను నిన్న నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ ప్రభాస్ 35 లక్షలు ఇస్తాడన్న విషయాన్ని బయటపెట్టాడు.. ప్రభాస్ పై దర్శకుల సంఘం అభినందనలు కురిపించారు. ఈ వార్త వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.. ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. కల్కి, సలార్ 2,రాజా సాబ్, స్పిరిట్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు ప్రభాస్.. త్వరలోనే కల్కి సినిమా విడుదల కాబోతుంది..

Exit mobile version