NTV Telugu Site icon

Bigg Boss7: జై జవాన్, జై కిసాన్ మల్లొచ్చినా బాపు.. కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకున్న పల్లవి ప్రశాంత్!

Pallavi Prashanth

Pallavi Prashanth

Pallavi Prashanth Father Enters Bigg Boss Telugu 7: ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్​బాస్’ తెలుగు సీజన్ 7లో ప్రస్తుతం ‘ఫ్యామిలీ వీక్‌’ నడుస్తోంది. కంటెస్టెంట్స్‌ కుటుంబ సభ్యులు ఒక్కోక్కరిగా హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. దాంతో ఈ వారం బిగ్‌ బాస్‌లో సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే దాదాపు అందరి కుటుంబ సభ్యులు హౌస్‌లోకి వచ్చేశారు. సీజన్ 7 కంటెస్టెంట్స్‌ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌, సోషల్ మీడియా స్టార్ రతిక కుటుంబ సభ్యులు ఈరోజు వచ్చే ఎపిసోడ్‌లో కనిపించనున్నారు. తాజాగా ప్రశాంత్‌ తండ్రి బిగ్​బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఒకటి నెట్టింట వైరల్ అయింది.

పల్లవి ప్రశాంత్‌ తండ్రి బంతిపూలు పట్టుకుని బిగ్‌ బిగ్​బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. బాబు బంగారం అని అనగానే పరుగెత్తిన ప్రశాంత్‌.. ఒక్కసారిగా తన తండ్రి కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకుంటాడు. అనంతరం ఇద్దరు కౌగిలించుకుని ఎమోషనల్‌ అవుతారు. సంతోషంలో తన తండ్రిని ప్రశాంత్‌ ఎత్తుకుని తిరుగుతాడు. ఆ సమయంలో వారి వద్దకు శివాజీ రాగానే.. నా బిడ్డను ఓ తండ్రి లాగా చూసుకున్నావ్‌ అని ప్రశాంత్‌ తండ్రి అంటాడు. జై జవాన్, జై కిసాన్ మల్లొచ్చినా బాపు అని ప్రశాంత్‌ అనగా.. తగ్గేదెలా అని అతడి తండ్రి అంటాడు. దాంతో కంటెస్టెంట్స్‌ ఎమోషనల్ అవుతారు. కామన్​ మ్యాన్​ కోటాలో మొదటిసారిగా రైతుబిడ్డగా బిగ్​బాస్​లోకి ప్రశాంత్ అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

Show comments