దసరా నవరాత్రులంటే ఎంతో సందడి.. ముఖ్యంగా విజయవాడలోని దుర్గమ్మ అమ్మవారిని ఎంతో భక్తితో కొలుస్తారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న దసరా దేవి శరన్నవరాత్రులలో అమ్మవారి విషయంలో అక్కడి భక్తులు తమ ప్రత్యేకత చాటుకున్నారు. దసరా వేడుకల్లో భాగంగా కోటి రూపాయల నూతన కరెన్సీ నోట్లతో ధనలక్ష్మి అమ్మవారిగా అలంకరణ చేశారు.
Read Also: Jogi Ramesh: నేను అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా
ధనలక్ష్మి అమ్మవారి అలంకరణలో పది రూపాయల నోటు నుండి 500 రూపాయల నోట్ల వరకు నూతన కరెన్సీని వివిధ రూపాలలో అలంకరణ చేశారు. సంఘ సభ్యులందరూ సహకరించి ఈ నూతన కరెన్సీని అమ్మవారి అలంకరణకు ఇచ్చారని అంతేకాకుండా వారి కి పరిచయలు ఉన్న బ్యాంకుల నుంచి ఈ కరెన్సీ ని తీసుకువచ్చి అలంకరణలో వినియోగించామని భక్తులు యావన్మంది అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించాలని నిర్వాహకులు కోరారు. ఈ కోటి రూపాయల అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.ఈ కోటి రూపాయల అమ్మవారు మాత్రం జిల్లా వ్యాప్తంగా వైరల్ అవుతోంది. గోదారోళ్ళు ఏం చేసినా ఇలాగే వుంటుంది మరి..
Read Also: Prabhas: అఫీషియల్.. రావణ దహనానికి హాజరుకానున్న ప్రభాస్