World Cup 2023: ఈరోజు న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ ఫఖార్ జమాన్ అరుదైన ఘనత సాధించాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన పాకిస్తాన్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కేవలం 63 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఇమ్రాన్ నజీర్ పేరిట ఉండేది. 2007 వన్డే వరల్డ్‌కప్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 95 బంతుత్లో నజీర్ సెంచరీ సాధించాడు. అయితే ఆ రికార్డును ఫకర్ జమాన్ బ్రేక్ చేశాడు.
Read Also: NZ vs PAK: వదలని వరుణుడు.. మరోసారి మ్యాచ్కు అడ్డంకి
ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో జమాన్ అత్యధిక సిక్స్‌లు బాదాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 9 సిక్స్‌లు కొట్టాడు. అంతకుముందు జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో నజీర్ 8 సిక్స్ లు కొట్టగా.. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించాడు. మరోవైపు అంతకుముందు న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ రచిన్ రవీంద్ర (108) పరుగులు చేసి జట్టు స్కోరును పెంచితే.. ఇప్పుడు ఫకర్, కివీస్ జట్టకు ధీటుగా బదులిస్తున్నాడు.
Read Also: Food Vlogger: కేరళలో ప్రముఖ ఫుడ్ వ్లాగర్ ఆత్మహత్య..