Site icon NTV Telugu

Shoaib Malik : షోయబ్ మాలిక్ మూడో పెళ్లి.. ఓ రేంజ్ లో ఆడుకుంటున్న నెటిజన్స్

New Project (74)

New Project (74)

Shoaib Malik : పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయ‌బ్ మాలిక్ ముచ్చట మూడో పెండ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లుగా భార్య సానియా మీర్జాకు దూరంగా ఉంటున్న అత‌డు.. పాక్‌కు చెందిన న‌టి స‌నా జావెద్‌ను పెళ్లి చేసుకున్నాడు. త‌మ పెండ్లి వేడుక ఫొటోల‌ను షోయ‌బ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ మధ్య విడాకుల వార్తల మంట ఇంకా చల్లారనే లేదు. షోయబ్ మాలిక్ మూడవ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించాయి. పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను హఠాత్తుగా పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే, ఫోటోలు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చూసిన ప్రజలు.. మొదట్లో నమ్మలేకపోయారు. ఆ ఫోటోలు నకిలీవి అని భావించారు.. వార్తలు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

Read Also:Nikhil Gupta: అమెరికాకు నిఖిల్ గుప్తాను అప్పగించేందుకు కోర్టు అనుమతి..

సానియా మీర్జా, షోయబ్ మాలిక్ 12 ఏప్రిల్ 2010న వివాహం చేసుకున్నారు. దీనిపై అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. సానియా పాకిస్థానీని పెళ్లాడిందన్న దుమారం రేపుతోంది. షోయబ్ మాలిక్ పెళ్లి వార్త తెలిసిన వెంటనే ట్విట్టర్‌లో జనం గుమిగూడారు. యూజర్లు రకరకాల కామెంట్స్ తో నెటిజన్స్ షోయబ్ మాలిక్ ను ఆడేసుకుంటున్నారు. వారిలో నెటిజన్ ‘షోయబ్ మాలిక్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. లీ, కానీ బాబర్ ఆజం ఇప్పటికీ ఒంటరిగా తిరుగుతున్నాడంటూ రాసుకొచ్చాడు.

Read Also:Bode Prasad: టీడీపీలోకి పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి..! బోడే ప్రసాద్‌ కీలక వ్యాఖ్యలు

Exit mobile version