Site icon NTV Telugu

Worst Record: ఆస్ట్రేలియా గడ్డపై పాకిస్థాన్ చెత్త రికార్డు.. ఒక్క టీ20 మ్యాచ్‌ కూడా.. !!

Pakistan

Pakistan

Worst Record: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన చేస్తోంది. బాబర్ సేన వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయి విమర్శలను ఎదుర్కొంటోంది. టీమిండియాతో మ్యాచ్ పక్కన పెడితే జింబాబ్వే లాంటి జట్టుపైనా ఓడటం ఆ జట్టు మానసిక పరిస్థితిని బహిర్గతం చేస్తోంది. పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు కూడా తమ జట్టుపై మాటల తూటాలతో పాటు సెటైర్లు పేలుస్తున్నారు. విచిత్రం ఏంటంటే.. ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటివరకు పాకిస్థాన్ ఒక్క టీ20 మ్యాచ్ కూడా నెగ్గలేదు. ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో పాకిస్థాన్ రెండు సార్లు ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లలో తలపడగా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. 2010, 2019లో పాకిస్థాన్ ఈ సిరీస్‌లలో తలపడింది. దీంతో పాకిస్థాన్ చెత్త రికార్డును మూటగట్టుకుంది.

Read Also: Guinnis Record: గిన్నిస్ రికార్డుల్లో దుబాయ్ రోలర్ కోస్టర్.. ప్రత్యేకత ఏంటంటే..?

పాకిస్థాన్‌తో పాటు ఆప్ఘనిస్తాన్ కూడా ఇప్పటివరకు ఆస్ట్రేలియా గడ్డపై ఇంటర్నేషనల్ టీ20ల్లో విజయం సాధించకపోవడం గమనించాల్సిన విషయం. కాగా ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటివరకు ఆస్ట్రేలియా 34 టీ20 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఈ జాబితాలో రెండో స్థానంలో టీమిండియా ఉంది. టీమిండియా ఇప్పటివరకు ఆసీస్ గడ్డపై 9 మ్యాచ్‌లను నెగ్గింది. శ్రీలంక కూడా 9 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఐర్లాండ్ 5 మ్యాచ్‌లలో, ఇంగ్లండ్ 4 మ్యాచ్‌లలో, దక్షిణాఫ్రికా 3 మ్యాచ్‌లలో, జింబాబ్వే 3 మ్యాచ్‌లలో, నెదర్లాండ్స్ 2 మ్యాచ్‌లలో, వెస్టిండీస్ 2 మ్యాచ్‌లలో గెలుపు రుచి చూశాయి. బంగ్లాదేశ్, నమీబియా, న్యూజిలాండ్, పపువా అండ్ గునియా, యూఏఈ ఒక్కో మ్యాచ్‌లో విజయం సాధించాయి.

Exit mobile version