Site icon NTV Telugu

Pakistan vs Sri Lanka: టాస్ గెలిచిన శ్రీలంక.. బాబర్ ఔట్.. పాకిస్థాన్‌ జట్టులో ఊహించని మార్పులు!

Pakistan Vs Sri Lanka

Pakistan Vs Sri Lanka

Pakistan vs Sri Lanka: టీ20 ప్రపంచ కప్‌ సూపర్-8 గ్రూప్-2లో భాగంగా పాకిస్థాన్, శ్రీలంక జట్లు పోటీ పడుతున్నాయి. టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. డూ ఆర్ డై మ్యాచ్‌లో పాక్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. శ్రీలంక సొంత గడ్డ పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 64 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించాలి. ఈ మ్యాచ్‌లో ఒక వేళ శ్రీలంక గెలిస్తే నెట్‌రన్‌రేట్‌తో సంబంధం లేకుండా న్యూజిలాండ్ డైరెక్ట్‌గా సెమీస్‌కు చేరనుంది.

READ MORE: Dubai Airport: ప్రపంచంలోనే అత్యంత బిజీ ఎయిర్‌పోర్ట్ షట్ డౌన్..

అయితే.. పాకిస్థాన్ జట్టులో ఊహించని మార్పులు చేసింది. మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను జట్టులో నుంచి తప్పించడం పెద్ద సంచలనంగా మారింది. ఇటీవల బాబర్ ఫామ్‌పై విమర్శలు వస్తుండగా, మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. బాబర్‌తో పాటు సైమ్ అయూబ్, సల్మాన్ మిర్జాను సైతం లేపేసింది. వారి స్థానాల్లో నసీమ్ షా, ఖ్వాజా నఫాయ్, అబ్రార్ అహ్మద్‌లకు అవకాశం ఇచ్చింది. ఈ కీలక మ్యాచ్ ముందు భారీ మార్పులు చేయడం సంచలనంగా మారింది. మరోవైపు.. శ్రీలంక సైతం రెండు మార్పులు చేసింది. కుశల్ మెండిస్, దుశాన్ హెమంతలకు విశ్రాంతి ఇచ్చి కమిల్ మిశారా, జనిత్ లియనేజ్‌లకు అవకాశం కల్పించింది. క ప్టెన్ దసున్ షనాకా సారథ్యంలో లంక జట్టు సమతూకంగా కనిపిస్తోంది.

READ MORE: Gold & Silver Prices: యుద్ధం ఎఫెక్ట్.. కొండెక్కిన బంగారం, వెండి ధరలు.. వామ్మో ఒక్కరోజులో ఇంత పెరిగాయేంటి?

పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్: సాహిబ్‌జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా (కెప్టెన్), ఖ్వాజా నఫాయ్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, షాహీన్ ఆఫ్రిది, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్.

శ్రీలంక ప్లేయింగ్ ఎలెవన్: పతుం నిస్సంక, కమిల్ మిశారా (వికెట్ కీపర్), చరిత్ అసలంక, పవన్ రత్నాయకే, కమిందు మెండిస్, దసున్ షనాకా (కెప్టెన్), జనిత్ లియనేజ్, దునిత్ వెల్లాలగే, మహీష్ తీక్షణ, దుష్మంత చమీర, దిల్షాన్ మదుశంక.

 

 

Exit mobile version