Pakistan vs England: నేడు పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ పాకిస్థాన్‌కు చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే.. ఇటీవల న్యూజిలాండ్‌తో మ్యాచ్ రద్దు అయిన విషయం తెలిసిందే. దీంతో చెరో పాయింట్స్ వచ్చాయి. దీంతో తాజాగా శ్రీలంకలోని కాండీలోని పల్లెకెలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా మంగళవారం జరిగే ఈ పోరు సెమీఫైనల్ ఆశల దృష్ట్యా పాకిస్థాన్‌కు అత్యంత కీలకంగా మారింది. ఇక ఇప్పటికే శ్రీలంకను ఓడించి రెండు పాయింట్లు సాధించిన ఇంగ్లండ్ జట్టు పూర్తి ఫిట్‌గా కనిపిస్తోంది. అదే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తోంది. ఈ మ్యాచ్‌కు వాతావరణ ఎఫెక్ట్ ఏమీ లేదు. అంటే వర్షం పడే సూచనలు కనిపించడం లేదు. తాజా వాతావరణ శాఖ రిపోర్టు ప్రకారం.. నగరంలో పగటి సమయంలో వర్షం పడే అవకాశం సుమారు 25 శాతం మాత్రమే ఉంది. మేఘావృతం దాదాపు 48 శాతం ఉండొచ్చని అంచనా. రాత్రి వేళకు వర్షం అవకాశాలు కేవలం 2 శాతానికి పడిపోతాయి. అప్పటికి మేఘావృతం కూడా 12 శాతానికి తగ్గే అవకాశం ఉంది. మ్యాచ్ ప్రారంభానికి ముందే వర్షం పడే సూచనలు సన్నిగిల్లుతాయి.
ఇదిలా ఉండగా.. మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ ఇంగ్లండ్‌కు తమ స్పిన్ దళం పెద్ద సవాల్‌గా మారుతుందని వెల్లడించాడు. ఇదే మైదానంలో స్పిన్‌కు ఇంగ్లండ్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారని గుర్తుచేశాడు. శ్రీలంక వద్ద ఒకరిద్దరు స్పిన్నర్లు మాత్రమే ఉన్నారని తమ జట్టులో ఐదుగురు స్పిన్నర్లు ఉన్నారని చెప్పాడు. ఇదే ప్రస్తుతం ఇంగ్లండ్‌ను కష్టాల్లోకి నెడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరోవైపు.. ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సెమీఫైనల్‌కు చేరుతుంది. దీంతో డోంట్ కేర్ అనే విధంగా ఇంగ్లండ్ జట్టు ప్రవర్తన ఉంది. పాకిస్థాన్‌ను శ్రీలంక మాదిరిగానే ఓడించి డైరెక్ట్‌గా సెమీస్‌కు చేరాలని ప్రయత్నిస్తోంది. పాకిస్థాన్‌కి మాత్రం ఇది ‘డూ ఆర్ డై’ పోరు.
READ MORE: Save Punarvika: పునర్విక ప్రాణం నిలిచింది? అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సోషల్ మీడియా!
