Site icon NTV Telugu

Pakistan Train: ఇది రైలా.? లేక యమలోకానికి దారి చూపే వాహనమా..? వీడియో వైరల్..!

Pakistan Train

Pakistan Train

Pakistan Train: ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. అయితే తాజాగా పాకిస్థాన్ లోని ఓ రైలు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ ట్రోలింగ్ కు గురి అవుతుంది. పాకిస్తాన్‌ లోని కరాచీ నుంచి పేశావర్‌కు పరుగులు తీసే ‘ఆవామ్ ఎక్స్‌ప్రెస్’ అనే రైలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. అయితే దీనికి కారణం.. ఈ రైలులోని దయనీయ పరిస్థితి. వైరల్ గా వీడియోలో ఈ రైలు ఎంత దారుణ స్థితిలో ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. రైలులో ప్రయాణికులు ఉన్నా కానీ అక్కడికి పరిస్థితిని చూసిన నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు.

Death Penalty: ఆ ఒక్క మందు 144 మంది ఉరిశిక్షకి కారణం.. అసలేంటి ఆ మందు..?

వీడియోలో మొదట రైలులో కూర్చున్న ప్రయాణికులు కనిపిస్తారు. అయితే, కొన్ని సెకన్ల వ్యవధిలోనే అసలు విషయం బయటపడుతుంది. రైలోని బోగీల్లో కొన్ని సీట్లు తొలగించబడ్డట్టు కనిపిస్తోంది. మరికొన్ని చోట్ల ఫ్లోర్‌ కూడా సరిగా లేదు. ఎందుకంటే అక్కడ అక్కడ ఏదో మట్టి పెళ్లలకు సంబంధించి చెత్త భారీగా పేర్కొనింది. అంతేకాదండోయ్.. రైలు బాడీకి కూడా పెద్ద పెద్ద రంధ్రాలు కనిపిస్తున్నాయి. ఆ రంధ్రాల ద్వారా బయట ఏముందో కూడా స్పష్టంగా కనిపిస్తోంది.

ICC Rankings: మనల్ని ఎవర్రా ఆపేది.. ఐసీసీ ర్యాంకింగ్స్‎లో టాప్ లేపిన టీమిండియా స్టార్స్..!

ఈ వీడియోను షేర్ చేయగా నిమిషాల వ్యవధిలో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా పాకిస్తాన్ రైల్వే పరిస్థితిని హాస్యంగా ట్రోల్ చేస్తూ సెటైర్లు వేశారు. కొందరైతే.. పాకిస్తాన్ రైల్వే వ్యవస్థ ఎంత దారుణ స్థితిలో ఉందో ఈ ఒక్క వీడియో చాలు అంటూ కామెంట్ చేస్తుండగా.. యాత్రికుల భద్రత, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఇది చాటుతోందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version