Pakistan: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 14 మంది మృతి, 30 మందికి గాయాలు!
- పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి
- 14 మంది మృతి, 30 మందికి గాయాలు
- క్వెట్టాలో బీఎన్‌పీ రాజకీయ సమావేశంలో ఆత్మాహుతి దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో 14 మంది మరణించగా.. దాదాపుగా 30 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని అధికారులు చికిత్స నిమ్మితం సమీప ఆస్పత్రికి తరలించారు. బలోచిస్థాన్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ప్రావిన్షియల్ ముఖ్యమంత్రి సర్దార్ అతావుల్లా మెంగల్ వర్ధంతిని పురస్కరించుకుని బలోచ్ రాజధాని క్వెట్టాలో బీఎన్‌పీ రాజకీయ సమావేశం నిర్వహించగా.. ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారి హంజా షఫాత్ ఓ ప్రకటనలో తెలిపారు.
క్వెట్టాలోని షావానీ స్టేడియంలో జరిగిన బీఎన్‌పీ సమావేశంకు వందలాది మంది బలోచ్ మద్దతు దారులు హాజరయ్యారు. సమావేశం జరుగుతుండగా..స్టేడియం పార్కింగ్ స్థలంలో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. దీంతో ఘటనా స్థలంలోనే పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బాంబు దాడి జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. భద్రతా బలగాలు స్టేడియం ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకొని తనిఖీలు చేపట్టాయి.
Also Read
- లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
- Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
సర్దార్ అతావుల్లా మెంగల్ కుమారుడు సర్దార్ అక్తర్ మెంగల్ సురక్షితంగా ఉన్నాడని ప్రభుత్వ అధికారి హంజా షఫాత్ తెలిపారు. ఘటనలో 30 మంది గాయపడ్డారని తెలిపారు. జనాలు ర్యాలీ అనంతరం బయటకు వెళ్తుండగా.. పార్కింగ్ ప్రాంతంలో బాంబు పేలిందని చెప్పారు. ఈ దాడికి సంబంధించి ఏ ఉగ్ర సంస్థ ఇంతవరకు ప్రకటన చేయలేదు.
తాజావార్తలు
-
Iran-Israel Tensions: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..
-
Shubman Gill History: చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. భారత క్రికెట్ చరిత్రలోనే మొదటి కెప్టెన్!
-
లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
-
Dragon : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసెంబర్ దాకా ఆగాల్సిందే!
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!