Site icon NTV Telugu

India vs Pakistan: ఆసియా కప్‌ 2025లో భారత్‌, పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..

Indvspak

Indvspak

India vs Pakistan: అండర్-19 ఆసియా కప్‌ 2025లో పాకిస్థాన్‌ ఫైనల్‌కు చేరింది. దుబాయ్‌లోని ది సెవెన్స్ స్టేడియంలో జరిగిన రెండో సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్‌ విజయం సాధించింది. 122 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్‌ తేలికగా చేధించింది. ఈ విజయంతో ఫైనల్లో భారత్‌తో తలపడనుంది. ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. వర్షం కారణంగా మ్యాచ్‌ను ఇరు జట్లకు 27 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ పాకిస్థాన్‌ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు కేవలం 121 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో ఒక్కరూ కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. పాకిస్థాన్‌ బౌలర్ అబ్దుల్ సుభాన్ నాలుగు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్థాన్‌ ఎలాంటి ఇబ్బంది పడకుండా బ్యాటింగ్ చేసింది. టార్గెట్ స్వల్పంగా ఉండటంతో ఆరంభం నుంచే ఆధిపత్యం చూపించి విజయాన్ని ఖాయం చేసుకుంది.

READ MORE: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

గ్రూప్ దశలో బంగ్లాదేశ్‌ గ్రూప్-బీలో మూడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో టాప్‌లో నిలిచింది. అయితే సెమీఫైనల్లో ఆ ప్రదర్శనను కొనసాగించలేకపోయింది. మరోవైపు పాకిస్థాన్‌ గ్రూప్-ఏలో భారత్ చేతిలో ఓటమి పాలై రెండో స్థానంలో నిలిచినా, నాకౌట్ మ్యాచ్‌లో మెరుగైన ఆటతో ఫైనల్‌ చేరింది. మరోవైపు.. అండర్‌ 19 ఆసియా కప్‌ 2025 ఫైనల్‌కు యువ భారత్‌ దూసుకెళ్లింది. దుబాయ్ వేదికగా డిసెంబర్ 19న శ్రీలంకతో జరిగిన సెమీస్‌-1లో భరత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. లంక నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లు విహాన్‌ మల్హోత్రా (61 నాటౌట్; 45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు), ఆరోన్‌ జార్జ్‌ (58 నాటౌట్, 49 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. ఇప్పటికే ఫైనల్‌కు చేరిన భారత్‌తో పాకిస్థాన్‌ తుది పోరులో తలపడనుండటంతో అండర్-19 ఆసియా కప్‌ ఫైనల్‌పై భారీ ఆసక్తి నెలకొంది.

READ MORE: India T20 World Cup 2026 Squad: నేడు టీ20 వరల్డ్ కప్‌కు భారత జట్టు ప్రకటన.. శుభ్‌మన్ గిల్ కష్టమేనా?

Exit mobile version