Will PCB take action against Shaheen Afridi: టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ గ్రూప్ స్టేజ్ నుంచే నిష్క్రమించిన విషయం తెలిసిందే. అమెరికా, భారత్ చేతిలో ఓడిన పాక్ జట్టు ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. టోర్నీ అనంతరం కోచ్ గ్యారీ కిరిస్టెన్ కూడా పాక్ ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో సెలక్షన్ కమిటీపై పీసీబీ చర్యలకు దిగింది. ఈ క్రమంలో తాజాగా పాకిస్తాన్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిది గురించి ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పాక్ కోచ్ కిరిస్టెన్‌తో అఫ్రిది అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. కోచ్‌తో పాటు ఇతర సిబ్బందితోనూ అతడు దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ సందర్భంగానే కాకుండా.. అంతకుముందు ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల సమయంలోనూ ఇలానే వ్యవహరించాడట.
Also Read: Dimple Hayathi Workout: డింపుల్ హయాతి ఫిట్‌నెస్ కష్టాలు.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే!
‘షహీన్ అఫ్రిది ప్రవర్తన సరిగా లేదని విమర్శలు వచ్చాయి. కోచ్‌లు, మేనేజ్‌మెంట్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. అయితే ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో చర్యలు తీసుకోలేదు. జట్టులోని ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలగాల్సిన అవసరం ఉంది. ఇదంతా మేనేజ్‌మెంట్ బాధ్యత. అఫ్రిదిపై విచారణ ఎందుకు చేపట్టలేదో అర్థం కావడం లేదు. ఇటీవల కొందరు ప్లేయర్స్ లాబీయింగ్ ద్వారా జట్టులోకి వచ్చారు. టీ20 ప్రపంచకప్‌లో ఒక్కరు కూడా బాధ్యతతో ఆడలేదు. పీసీబీ ఛైర్మన్‌కు ఫిర్యాదు అందడంతో విచారణకు ఆదేశించారు’ అని పాకిస్తాన్ క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు అఫ్రిది చిక్కుల్లో పడ్డాడు. మరి పీసీబీ ఏ చర్యలు తీసుకుంటుందో చూడాలి.