Site icon NTV Telugu

FATF Pakistan: దాయాది పాక్‌కు ఊరట.. నాలుగేళ్ల తర్వాత గ్రే లిస్ట్‌ నుంచి తొలగింపు

Fatf

Fatf

FATF Pakistan: దాయాది దేశం పాకిస్తాన్‌కు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయ ఆర్థిక సాయం పొందే విషయంలో అవకాశం లభించనుంది. ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్ఏటీఎఫ్‌) ఎట్టకేలకు ‘గ్రే’ లిస్ట్‌ నుంచి తొలగించింది. ఫలితంగా ఇక నుంచి పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఏడీపీ, యూరోపియన్‌ యూనియన్‌ వంటి సంస్థల నుంచి నిధులు పొందే అవకాశం లభించనుంది. గురు, శుక్రవారాల్లో సింగపూర్‌లో జరిగిన సమావేశంలో ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదుల కార్యకలాపాల విషయంలో పాక్ పురోగతి సాధించిందని, తీవ్రవాద సంస్థలకు నిధుల చేరవేతలో దిగొచ్చిందని ఈమేరకు నిర్ణయం తీసుకుంది.

Veerasimhareddy: నడిచొచ్చే ‘సింహా’నికి… కలిసొచ్చే కలెక్షన్స్!

జైషే మహ్మద్‌ అధినేత మజూర్ అజార్‌, లష్కరే తొయిబా అధినేత హఫీజ్ సయీద్‌, అతని సహాయకుడు జకీవుర్ రెహమాన్‌ లఖ్వీలపై చర్యలు తీసుకోకపోవడంలో తొలిసారిగా 2018లో తొలిసారిగా పాక్‌ గ్రే లిస్ట్‌లో ఉంచింది. అనంతరం రెండు సార్లు పాక్‌కు అవకాశం ఇచ్చింది. కానీ పాక్‌ సద్వినియోగం చేసుకోలేదు. ఎట్టకేలకు పాక్‌ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా సంతృప్తికరంగా చర్యలు తీసుకుందని భావించిన ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ ‘గ్రే’ లిస్ట్ నుంచి తొలగించింది. అయితే అనూహ్యంగా మరో ఆసియా దేశం మయన్మార్‌ను బ్లాక్ లిస్టులో చేర్చింది. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, టాంజానియా, మొజాంబిక్ దేశాలను కొత్తగా గ్రే లిస్టులో చేర్చింది. పాకిస్తాన్‌, నికరాగ్వా దేశాలను ఈ జాబితా నుంచి తొలగించింది.

Exit mobile version