Osama Bin Laden: పాక్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ సన్నిహితుడు, అధికార ప్రతినిధి ఫర్హాతుల్లా బాబర్ తాను రాసిన కొత్త పుస్తకం ‘‘ది జర్దారీ ప్రెసిడెన్సీ: నౌ ఇట్ మస్ట్ బీ టోల్డ్’’లో సంచలన విషయాలను పేర్కొన్నారు. అల్‌ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను తమ భూభాగంపై.. అదీ తమకు తెలియకుండా అమెరికా బలగాలు రహస్యంగా మట్టుబెట్టడం పాకిస్థాన్ నేతలను తీవ్ర అవమానానికి, అయోమయానికి గురిచేసిందని రాసుకొచ్చాడు.. అప్పటి 2011లో అబోటాబాద్‌లో లాడెన్ హత్యానంతరం స్థానికంగా నెలకొన్న గందరగోళ పరిస్థితులను వివరించారు. దీంతో ఒక్కసారిగా బిన్‌లాడెన్ పేరు మళ్లీ చర్చనీయాంశంమైంది.
READ MORE: మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, 6.67 అంగుళాల HD+ లతో కేవలం రూ.10499లకే Realme P3 Lite 5G లాంచ్!
తాలిబన్ నాయకుడు ఒసామా బిన్ లాడెన్ సెప్టెంబర్ 11, 2001న అమెరికా న్యూయార్క్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై అటాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 3,000 మందికిపైగా జనాలు ప్రాణాలు కోల్పోయారు. 9/11 ఘటనగా పిలువబడే ఈ దాడులు అమెరికాను అతలాకుతలం చేశాయి. ఈ దాడులపై ప్రతీకారంతో రగిలిపోయిన అమెరికా.. చివరకు ఒసామా బిన్ లాడెన్‌ను దొరకబట్టుకుని మరీ అంతమొందించారు. సరిగ్గా 11 ఏళ్ల క్రితం అమెరికన్ నేవీ సీల్స్.. బిన్ లాడెన్ ఉన్న చోటకు వెళ్లి మరీ దాడి చేసి చంపేశారు.
READ MORE: మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, 6.67 అంగుళాల HD+ లతో కేవలం రూ.10499లకే Realme P3 Lite 5G లాంచ్!
పాక్‌లోని అబొట్టాబాద్ మిలిటరీ కంటోన్మెంట్ శివారులోని ఓ సురక్షిత ప్రాంతంలో అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ దాక్కున్నట్లు అమెరికాకు 2011లో స్పష్టమైన సమాచారం వచ్చింది. అతడిపై దాడి చేసేందుకు ‘ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్’కు నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. రెండు బ్లాక్‌హాక్ హెలికాప్టర్లలో పాక్ రాడార్ సిగ్నల్స్‌ను తప్పించుకొని వెళ్లిన 79 మంది కమాండోలు, ఓ కుక్క లాడెన్ ఇంటిని చుట్టుముట్టి దాడి చేశారు. ఈ క్రమంలో ఓ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఆ ఇంటి పైన గదిలో ఉన్న లాడెన్‌ను హతమార్చిన కమాండోలు.. డీఎన్‌ఏ పరీక్షల అనంతరం అతడి మృతదేహాన్ని సముద్రంలో ఖననం చేశారు.
