ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పనామా పత్రాల కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమారులు (Pakistan Nawaz sharifs Sons) న్యాయస్థానం ముందు లొంగిపోనున్నారు. 3 అవినీతి కేసుల్లో కుమరులిద్దరూ (3 Corruption Cases) కోర్టు ముందు లొంగిపోనున్నారు (Surrender). ఇందుకోసం మార్చి 12న ఇస్లామాబాద్ చేరుకోనున్నారు.
ఇదిలా ఉంటే తమ అరెస్ట్ వారెంట్లను సస్పెండ్ చేయాలని కోరుతూ షరీఫ్ కుమారులు హుస్సేన్ నవాజ్, హసన్ నవాజ్ అకౌంటబిలిటీ కోర్టును ఆశ్రయించినట్లుగా పాక్ మీడియా కథనాలు తెలిపాయి. వీరి పిటిషన్లపై విచారణ జరగనుంది. విచారణ ప్రక్రియను ఎదుర్కొనేందుకు హుస్సేన్, హసన్ కోర్టు ముందు లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. షరీఫ్ సోదరుడు పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధాని మోడీ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఇక పంజాబ్ ముఖ్యమంత్రిగా షరీఫ్ కుమార్తె మరియం బాధ్యతలు చేపట్టారు. తొలి ముఖ్యమంత్రిగా రికార్డ్ సృష్టించారు. నవాజ్ షరీఫ్ కూడా మూడుసార్లు పాకిస్థాన్ ప్రధానిగా పనిచేశారు.