Site icon NTV Telugu

Pakistan Balochistan crisis: బలూచ్‌లో బలం చూపని పాక్.. ఉగ్రమూకల చేతిలో చావుదెబ్బ

Pakistan Balochistan Crisis

Pakistan Balochistan Crisis

Pakistan Balochistan crisis: తాను పెంచిపోషించిన ఉగ్రమూకలపై పాకిస్థాన్ నియంత్రణ కోల్పోయింది. ఒకరకంగా వాటి చేతిలో ఓడిపోయిందని పలు నివేదికలు పేర్కొన్నాయి. పాకిస్థాన్ సైన్యం బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులపై నియంత్రణ కోల్పోతున్నాయని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రెండు ప్రావిన్సులలోని అనేక ప్రాంతాలను BLA తిరుగుబాటు గ్రూపులు స్వాధీనం చేసుకున్నాయి. పాకిస్థాన్ పార్లమెంటులో ఆ దేశ సెనేటర్ కమ్రాన్ ముర్తజా దీనిని అంగీకరించారు. ఈ సందర్భంగా ఆయన పార్లమెంటులో మాట్లాడుతూ.. బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో తిరుగుబాటుదారులు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారని, దీనివల్ల భద్రతా దళాలు నిస్సహాయంగా ఉన్నాయని పేర్కొన్నారు. బలూచ్ నాయకులు, తిరుగుబాటుదారులు కమ్రాన్ ప్రసంగాన్ని తమ విజయంగా ప్రకటించుకున్నారు. అసలు పాక్ బలూచ్‌లో ఎందుకు బలం చూపలేకపోతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Mithun Reddy: వచ్చేది జగనన్న ప్రభుత్వమే.. దాని కోసం ఎన్ని కేసులైనా, ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటాం..!

పాక్ పార్లమెంట్‌లో ముర్తజా ఏం మాట్లాడారు..
పాక్ పార్లమెంటులో ముర్తజా మాట్లాడుతూ.. “పాకిస్థాన్ నిజంగా బలూచిస్థాన్‌ను పాలిస్తుందా?” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాలో ఇటీవల పాకిస్థాన్ సైనిక నియంత్రణ ఐదు కిలోమీటర్లకు తగ్గించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో పాకిస్థాన్ మంత్రులు, ఎంపీలు రోడ్డు మార్గంలో ప్రయాణించలేరు.. ఎందుకంటే ఈ రోడ్లను తిరుగుబాటుదారులు ఆక్రమించుకున్నారు. జాతీయ అసెంబ్లీ, ప్రావిన్సులకు ఎన్నికైన ప్రజలు కూడా ఈ రోడ్లపై నడవలేకపోతే, ఇప్పటికైనా పాక్ ప్రభుత్వం, సైన్యం మేల్కొనాలని హితవు పలికారు.

పాక్ సైన్యానికి తిరుగుబాటుదారుల చేతిలో ఓటమి.. !
బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో తిరుగుబాటుదారులతో పాకిస్థాన్ సైన్యం పోరాడటం కొత్త కాదు. దశాబ్దాలుగా ఈ ప్రాంతంపై పూర్తి నియంత్రణ సాధించడానికి పాక్ కష్టపడుతోంది. ఇటీవల ఈ ప్రాంతంలోని నాయకుల ప్రకటనల కారణంగా పాక్ సైన్యానికి మరిన్ని ఇబ్బందులు పెరిగాయని అంటున్నారు. ఇటీవల బలూచిస్థాన్‌లోని లక్కీ మార్వాట్ నాయకుడు షేర్ అఫ్జల్ మార్వాట్, తాలిబాన్లు ఈ ప్రాంతంలోని ఎక్కువ భాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని స్పష్టంగా పేర్కొన్నారు. బలూచిస్థాన్ చాలా కాలంగా అస్థిరతను ఎదుర్కొంటోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA)తో సహా ఈ ప్రావిన్స్‌లోని అనేక తీవ్రవాద గ్రూపులు పాకిస్థాన్ సైన్యానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు దిగాయి. ఈ తీవ్రవాద గ్రూపులు.. ఇక్కడి స్థానిక ప్రజలకు మరిన్ని హక్కులను డిమాండ్ చేస్తున్నాయి. ఈక్రమంలో పాక్ ఆర్మీ వారిని అణచివేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ ఈ పోరులో వారిపై పెద్దగా విజయం సాధించలేకపోయింది.

READ ALSO: RSS Centenary Celebrations 2025: భారతమాత సేవకే ఆర్ఎస్ఎస్ అంకితమైంది: పీఎం మోడీ

Exit mobile version