Ishaq Dar: యుద్ధం ఆపడానికి వెళ్లి భుజం విరగ్గొట్టుకున్న పాకిస్థాన్ ఉప ప్రధాని.. ఫొటోలకు ఫోజులిస్తూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ishaq Dar: ఇరాన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ భుజం విరిగింది. ఇరాన్ యుద్ధంలో పాకిస్థాన్ తరఫున మధ్యవర్తిత్వం వహిస్తున్న కీలక వ్యక్తి ఇషాక్ దార్. అంతర్జాతీయ వేదికపై తమ ప్రాముఖ్యతను చాటుకోవడానికి, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య జరుగుతున్న ఈ వివాదంలో పాకిస్థాన్ ఒక మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా మార్చి 29, ఆదివారం నాడు ఆయన పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఈజిప్ట్, టర్కీ, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రుల సమావేశాన్ని సమన్వయం చేశారు. ఈ సంఘటన పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగింది. ఈ భేటీలో ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బదర్ అబ్దెలాతీకి స్వాగతం పలికేందుకు ఇషాక్ డార్ రెడ్ కార్పెట్‌పై నడుస్తూ వెళ్తున్నారు. ఫోటోలకు ఫోజులిస్తూ, కరచాలనం చేసే క్రమంలో ఆయన కాలు జారి కిందపడిపోయారు. తాజాగా మంత్రి భుజాలకు, కాళ్లకు గాయాలయినట్లు పాకిస్థాన్ తెలిపింది. అయితే, పరిస్థితి తీవ్రతను లెక్కచేయకుండా, నొప్పితోనే రోజంతా పెయిన్ కిల్లర్స్ వేసుకుని అత్యంత కీలకమైన దౌత్య సమావేశాల్లో పాల్గొన్నారట.
READ MORE: Live in Relationship: సహజీవనం చేస్తున్న జంటలకు గుడ్‌న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం
Also Read
- Off The Record: కందుకూరు పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
- Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
- CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
- China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
మరోవైపు, యుద్ధం విషయానికి వస్తే.. ఇరాన్ ఘర్షణలు ప్రారంభమై నెల రోజులు దాటింది. ఈ యుద్ధం ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతుందనే ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ విదేశాంగ మంత్రులు ఇస్లామాబాద్‌లో భేటీ అయ్యారు. ప్రాంతీయ శాంతిని నెలకొల్పేందుకు చేస్తున్న ఈ సమన్వయ ప్రయత్నాల్లో ఇషాక్ డార్ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అయితే.. అధికారిక కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత రాత్రి 9 గంటల సమయంలో ఇషాక్ డార్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారట. ఆయన కుమారుడు అలీ డార్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఎక్స్‌రేలో ఆయన భుజానికి ‘హెయిర్‌లైన్ ఫ్రాక్చర్’ (Hairline Fracture) అయినట్లు తేలింది. రాబోయే కొద్ది రోజుల పాటు ఆయన మందులు వాడుతూ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. “సరిగ్గా నిలబడటానికి, నడవడానికే రాదు.. మీరు యుద్ధం ఆపుతారా?” అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ సైతం తెగ వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!