Site icon NTV Telugu

Ishaq Dar: యుద్ధం ఆపడానికి వెళ్లి భుజం విరగ్గొట్టుకున్న పాకిస్థాన్ ఉప ప్రధాని..

Pak

Pak

Ishaq Dar: ఇరాన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్‌ ఉప ప్రధాని ఇషాక్ దార్ భుజం విరిగింది. ఇరాన్ యుద్ధంలో పాకిస్థాన్‌ తరఫున మధ్యవర్తిత్వం వహిస్తున్న కీలక వ్యక్తి ఇషాక్ దార్. అంతర్జాతీయ వేదికపై తమ ప్రాముఖ్యతను చాటుకోవడానికి, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య జరుగుతున్న ఈ వివాదంలో పాకిస్థాన్‌ ఒక మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా మార్చి 29, ఆదివారం నాడు ఆయన పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఈజిప్ట్, టర్కీ, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రుల సమావేశాన్ని సమన్వయం చేశారు. ఈ సంఘటన పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగింది. ఈ భేటీలో ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బదర్ అబ్దెలాతీకి స్వాగతం పలికేందుకు ఇషాక్ డార్ రెడ్ కార్పెట్‌పై నడుస్తూ వెళ్తున్నారు. ఫోటోలకు ఫోజులిస్తూ, కరచాలనం చేసే క్రమంలో ఆయన కాలు జారి కిందపడిపోయారు. తాజాగా మంత్రి భుజాలకు, కాళ్లకు గాయాలయినట్లు పాకిస్థాన్ తెలిపింది. అయితే, పరిస్థితి తీవ్రతను లెక్కచేయకుండా, నొప్పితోనే రోజంతా పెయిన్ కిల్లర్స్ వేసుకుని అత్యంత కీలకమైన దౌత్య సమావేశాల్లో పాల్గొన్నారట.

READ MORE: Live in Relationship: సహజీవనం చేస్తున్న జంటలకు గుడ్‌న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం

మరోవైపు, యుద్ధం విషయానికి వస్తే.. ఇరాన్ ఘర్షణలు ప్రారంభమై నెల రోజులు దాటింది. ఈ యుద్ధం ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతుందనే ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ విదేశాంగ మంత్రులు ఇస్లామాబాద్‌లో భేటీ అయ్యారు. ప్రాంతీయ శాంతిని నెలకొల్పేందుకు చేస్తున్న ఈ సమన్వయ ప్రయత్నాల్లో ఇషాక్ డార్ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అయితే.. అధికారిక కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత రాత్రి 9 గంటల సమయంలో ఇషాక్ డార్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారట. ఆయన కుమారుడు అలీ డార్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఎక్స్‌రేలో ఆయన భుజానికి ‘హెయిర్‌లైన్ ఫ్రాక్చర్’ (Hairline Fracture) అయినట్లు తేలింది. రాబోయే కొద్ది రోజుల పాటు ఆయన మందులు వాడుతూ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. “సరిగ్గా నిలబడటానికి, నడవడానికే రాదు.. మీరు యుద్ధం ఆపుతారా?” అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ సైతం తెగ వైరల్ అవుతోంది.

Exit mobile version